విజయ్ దేవరకొండ తమ్ముడు గా సినిమా ల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హీరో ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా తో మరొక సారి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు, ఈ సినిమా మిడిల్ క్లాస్ ప్రజలు ఎదుర్కొనే చిన్న చిన్న కష్టాలను చాలా సరదా సన్నివేశాలతో చూపిస్తూ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా తో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇలా నటించిన రెండు సినిమాల తోనే ఎంతో మంచి నటుడిగా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ కొన్ని రోజుల క్రితమే పుష్పక విమానం  సినిమా తో మరో సారి ప్రేక్షకులను పలకరించాడు.

 స్కూల్ టీచర్ గా పని చేసే హీరో, పెళ్లి చేసుకున్న తర్వాత అతని భార్య ఎవరి తోనో వెళ్లిపోవడం వల్ల, ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి హీరో చేసే సరదా సరదా సన్నివేశా లతో ఈ సినిమా కొనసాగుతూ ఉంటుంది. థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనుకునే రేంజ్ లో రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇలా థియేటర్ లలో పర్వాలేదు అనే రేంజ్ లో రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో తెలుగు ప్రముఖ ఓటిటి  ఆహా లో స్ట్రీమ్మింగ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఆహా నిర్వహణ బృందం పుష్పక విమానం సినిమా డిసెంబర్ 10 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజా గా తెలియజేసింది. ఈ సినిమా పై ఆసక్తి ఉండి థియేటర్ లలో ఈ  మూవీ ని చూడని వారు ఎప్పుడు ఓటిటి  లో ఈ సినిమా వస్తుందా.? ఎప్పుడు చూద్దామా అని ఆసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: