సమంత ఏం చేసినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటీ ఈమె ఎలాంటి నిర్ణయం తీసుకున్న నెట్టింట అది వైరల్ అవుతుంది. భర్త తో సమంత కలిసి టూర్ కు వెళ్లిన..అదే భర్తకు విడాకులు ఇచ్చినా..ఇక మాజీ భర్త అయ్యాక బర్త డే కు విష్ చేయకపోయినా అది పెద్ద నేరంగా భావిస్తూ సమంత పై విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్. కానీ సమంత ఇవ్వన్నీ పట్టించుకోకుండా ఎవరు ఏమనుకున్నా నాకు ఆనవరసరం అనుకుంటూ తన కెరీర్ పై దృష్టి పెట్టింది.

నిజం చెప్పాలి అంటే విడాకుల తరువాతే సమంత సినిమాల విషయంలో స్పీడ్ పెంచిన్నట్లు కనిపిస్తుంది. పెళ్ళి తరువాత ఆమె సినిమాల విషయంలో పెద్ద గా కేర్ చేయలేదు. కానీ విడాకుల తరువాత మాత్రం  వరుస సినిమాలకు పచ్చ జెండా ఊపుతూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇక అవకాశాలు కూడా అమ్మడు అలాగే వస్తున్నాయి. మూడు బడా సినిమాలకు ఓకే చెప్పిన సమంత ఆ తరువాత బన్నీ తో కలిసి ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధపడ్దింది. ఇది అభిమానులకు షాకింగ్ గానే అనిపించినా ఆ తరువాత సుకుమార్ సినిమాలో అంటే అది పక్క హిట్ అవుతుంది అని సైలెంట్ అయిపోయారు.

ఇక ఆ తరువాత వెంటనే ఓ అంతర్జాతీయ సినిమాకి సైన్ చేసింది ఈ అమ్మడు. ఇక అక్కడే సమంత మీడియా లో హెడ్ లైన్స్ లో కనిపిస్తుంది.  విడాకుల తరువాత ఏకంగా ఇంటర్ నేష్నల్ లెవల్ లో సినిమా అవకాశం అంటే అది మాములు విషయం కాదు. "అరేంజ్మెంట్ ఆఫ్ లవ్" అనే ఓ హాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలో నటించడానికి సమంత అంగీకారం తెలుపుతూ సైన్ చేసింది.  అసలు ఎవ్వరు ఊహించని బైసెక్సువల్ పాత్రలో అమ్మడు ఈ సినిమా నటించడానికి సిద్ధమైంది అంటూ న్యూస్ బయటకు వచ్చింది. ఇక సమంత కి ఈ సినిమాలో ఆఫర్ వచ్చేలా చేసింది దగ్గుబాటి వారసుడు రానా అంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే  సమంతకు రానా బంధువులు కాక ముందు నుండే మంచి ఫ్రెండ్స్. ఇక విడాకుల తరువాత అమ్మడు లైఫ్ బాగుండాలి అనే.. రానాసినిమా స్టోరి  విన్నప్పుడు సమంత ని అప్రోచ్ అవ్వమని టీం కు సూచించారట. అలా రానా వల్లే ఆమె ఈ హాలీవుడ్ మూవీ కి సైన్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: