దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమా లో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటిస్తుండ గా అజయ్ దేవగన్, సముద్ర కని ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడం తో ఈ సినిమా ను సంక్రాంతి కానుక గా జనవరి 7 వ తేదీ న విడుదల చేయబో తున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది,  ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ ల స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఇద్దరు హీరో లకు సంబంధించిన ప్రోమో లను విడుదల చేసిన చిత్ర బృందం సినిమా పై అంచనాలు పెంచేసింది. వీటి తో పాటు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం దోస్తీ ప్రమోషనల్ సాంగ్ ను, నాటు నాటు సాంగ్ ను, జనని పాట ను విడుదల చేసింది.

ఇలా ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలతో జనాల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను డిసెంబర్ 3 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. ఇలా ప్రకటించడం తోనే మెగా, నందమూరి అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇంత లోనే ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 3 వ తేదీన విడుదల చేయట్లేదు అని తాజాగా చిత్ర బృందం మరొక సారి ఒక ప్రకటన విడుదల చేసింది. దానికి ప్రధాన కారణం ట్రైలర్ కు సంబంధించిన పనులన్నీ పూర్తి కాలేదు అని తెలుస్తోంది. మరి ఈ సినిమా ట్రైలర్ కొత్త విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: