సీనియర్ నటి ప్రభ ఇపుడు సీరియల్ తో త్వరలో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 'కలిసి ఉంటే కలదు సుఖం' అనే టైటిల్ తో ఈ సీరియల్ స్టార్ మాలో ప్రసారం కానుంది. ఇంకొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగియ నుండగా ఆ స్లాట్ లో 10 నుండి 10.30 వరకు ఈ సీరియల్ రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సీరియల్ లో ప్రభా నే లీడ్ రోల్ చేస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాగా మన ముందుకు రానున్న ఈ సీరియల్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ప్రజలకు ఏదో ఒక విధంగా దగ్గరవ్వాలని ఒక ఆకాంక్షతో వెండి తెర నుండి బుల్లి తెరకు, అలాగే బుల్లి తెర నుండి వెండి తెరకు వచ్చి నటనను కొనసాగిస్తున్నారు.

అయితే ఇందులో అందరూ సక్సెస్ కావడం అనేది జరగని పని. ఇప్పటికే ఒకప్పటి సీనియర్ హీరోయిన్ అందాల రాశి ఇప్పుడు మాటీవీలో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతున్న 'జానకి కలగనలేదు' సీరియల్ చేస్తోంది. ఈ సీరియల్ లో జ్ఞానాంబ పాత్రకు మంచి పేరు వస్తోంది. అదే విధంగా ఒకప్పటి నటి ప్రభ అప్పట్లో ఒక వెలుగు వెలిగింది. సీనియర్ హీరోలు రామారావు మరియు నాగేశ్వరావు లతో నటించి ప్రేక్షకుల్లో మంచి పేరును తెచ్చుకుంది.

ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగిన ప్రభ హీరోయిన్ తర్వాత సినిమాలలో సహాయక పాత్రలు చేస్తూ ఆకట్టుకుంది. మరి వయసు మీద పడుతోంది కదా... వెండి తెరపైన కాంపిటీషన్ వలనో ఏమో తెలియదు. కానీ, సీరియల్ లో నటించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వెండి తెరపై సక్సెస్ అయిన ప్రభ బుల్లి తెరపై ఆకట్టుకుంటుందా అన్నది తెలియాలంటే, ఈ సీరియల్ ప్రసారమయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: