నందమూరి అభిమానుల కల నెరవేరింది. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. నందమూరి నట సింహం బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అఖండ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను సంతృప్తి పరిచింది. అంతకుముందు అఖండ షూటింగ్ జరుగుతున్నప్పుడే బోయపాటి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెంచేశాయి. బాలయ్య డైలాగ్స్ అయితే విజిల్స్ వేసేలా చేశాయి.  బాలయ్య అఘోర పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచిందంటున్నారు. అంతేకాదు బాలయ్య చెప్పే డైలాగ్స్ కు ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ ఉర్రూతలూగిపోయారట.

ఇంకేముందీ మాస్ ఆడియన్స్ కు ఎక్కడలేని ఉత్కంఠ వారిలో చెలరేగింది. ఆ మూవీ ఎలాగైనా చూడాలని డిసైడ్ అయిపోయారు. ఒక రోజు ముందుగానే వెండితెరపై ప్రదర్శించడంతో ఆ సినిమా చూసిన వారు  సోషల్ మీడియాలో తమ ఒపినీయన్ ను బయటకు చెప్పేస్తున్నారు. పలువురు సినీనటులు బాలకృష్ణకు ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నారు. ప్రేక్షకుల స్పందన సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను పరిశీలిస్తే అఖండ్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందని అర్థమవుతోంది.

సినిమా విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ వండర్ అని చెప్పుకుంటున్నారు. బోయపాటి మాస్ ఆడియన్స్ కు కిక్కిచ్చేలా సినిమా తీశారని డైరెక్టర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ ను మించి ఉందని చెబుతున్నారు. మాస్ ఎలిమెంట్స్ ఎక్కడా తగ్గకుండా అద్బుతంగా చిత్రీకరించారంటున్నారు. బాలయ్య తన నట విశ్వరూపం ప్రదర్శించేందుకు ఈ సినిమా  వేదిక  అయిందంటున్నారు సినీనటులు, ఆడియన్స్. ఇక హీరోయిన్ ప్రజ్ఞాజైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్ లు తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారని మాట్లాడుకుంటున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటించగా.. పూర్ణ ప్రత్యేక పాత్రలో నటించింది.  

ఇక తమన్ మ్యూజిక్ అదిరిపోయిందట. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడని అంటున్నారు. ఈ చిత్రం కంప్లీట్ మాస్ ప్యాకేజ్ అని పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తానికి అఖండ చిత్రం బాలకృష్ణ అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: