యువరత్న నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ‌ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన సింహ - లెజెండ్ రెండు సినిమాలు ఒకదానిని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  రెండు సంవత్సరాల నుంచి అఖండ సినిమా కోసం బాలయ్య , బోయపాటి ఎంతో కష్టపడ్డారు. దీనికి తోడు క‌రోనా రావడంతో ఏడాది పాటు షూటింగ్ నిలిచిపోయింది. ఎన్నో అవాంతరాలు దాటుకుని ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చిన అఖండ సినిమాకు ప్రీమియర్ షో ల అనంతరం అదిరిపోయే టాక్ వస్తోంది. ఈ సినిమా లెజెండ్ సినిమా ను మించిన‌ పవర్ ఫుల్ గా ఉందని అభిమానులు చెబుతున్నారు.

ఇక సినిమాలో మామూలు బాల‌య్య పాత్ర క‌న్నా కూడా అఘోర పాత్ర బాగా హైలెట్ అయ్యింద‌ని చెపుతున్నారు. అఘోరా గా బాల‌య్య న‌ట విశ్వ‌రూప‌మే చూపించాడ‌ని సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రు చెపుతున్నారు. అఘోరా లాంటి పాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే రాలేద‌ని చెపుతున్నారు. బాల‌య్య లాంటి ఓ స్టార్ హీరో ఇలాంటి పాత్ర వేయ‌డం.. అది క‌రెక్టుగా నూటికి నూరు శాతం మ్యాచ్ అవ్వడం తో అఖండ కు మంచి హైలెట్ అయ్యింది.

ఏదేమైనా చాలా రోజుల త‌ర్వాత బాల‌య్య కు మంచి హిట్ ప‌డ‌డంతో నంద‌మూరి అభిమానుల ఆనందానికి అవ‌ధు లే లేవు. గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి హిట్ అయినా.. అది మాస్ జ‌నాల‌కు ఓ ఓమోస్తరుగా క‌నెక్ట్ అయ్యింది. ఇక లెజెండ్ త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయిలో బాల‌య్య ఫ్యాన్స్ కు ఊపు తెచ్చిన సినిమా అఖండే అంటున్నారు. అఖండ బాల‌య్య చ‌రిత్ర‌లోనే స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేయ‌డం అయితే ఖాయంగా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: