ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అఖండ' హంగామా మాములుగా లేదు. థియేటర్లు మొత్తం 'జై బాలయ్య' నినాదంతో దద్దరిలిపోతున్నాయి. ఎక్కడ చూసినా అఖండ హవానే కన్పిస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని, ఇంట్రడక్షన్ సీన్ కు ఫిదా అని అంటున్నారు నెటిజన్లు. విదేశాల్లో ముందుగానే ప్రీమియర్లు చూసిన ప్రేక్షకులు అఖండకు జేజేలు పలుకుతున్నారు. తమ ఫ్యాన్ మూమెంట్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. సినిమాలోని ఒక్కో సీన్ నూ వర్ణిస్తూ తమ భావాలను వ్యక్త పరుస్తున్నారు. సినిమా లోని యాక్షన్ సన్నివేశాలు, డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉందని, చాలా కాలం నుంచి బాలయ్య లోని ఈ యాంగిల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులను ఇది మాస్ జాతర అని అంటున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న విషయం సోషల్ మీడియాను చూస్తుంటేనే అర్థమై పోతుంది. అయితే దేశ విదేశాల్లో ఉన్న నందమూరి అభిమానులు తమ అభిమాన నటుడి మూవీ విడుదల కావడం, హిట్ టాక్ తెచ్చుకోవడంపై అభిమానాన్ని విభిన్నంగా వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా విదేశాల్లో 'అఖండ' అభిమానులు మాస్ జాతర జరుపుకుంటున్న వీడియో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా డల్లాస్ లో బాలయ్య అభిమానులు చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ఏకంగా బాలయ్య పై అభిమానాన్ని వ్యక్తం చేస్తూ కార్ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో కార్లు రోడ్ల పై బారులు తీరడం ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఇలా సరికొత్తగా విదేశాల్లో ఉన్న అభిమానులు బాలయ్యపై అభిమానాన్ని చాటుకుంటూ మాస్ జాతర నిర్వహించడంతో ఇక్కడ ఉన్న నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. మొత్తానికి బాలయ్య, బోయపాటి ఖాతాలో మరో గోల్డెన్ హిట్ పడినట్టే. దీంతో చిత్రబృందం కూడా చాలా సంతోషంగా ఉందట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: