నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న‌ అఖండ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబినేషన్ అనగానే ఎలాంటి భారీ అంచనాలు ఉంటాయో తెలిసిందే . ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అఖండ‌ సినిమా వుంటుందని.. సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక అనంతపూర్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది.

మైనింగ్ అక్రమాలు , మైనింగ్ దండాల కారణంగా ఒక ఊరి జనం చనిపోతుంటే వారిని అఖండ‌ అయిన బాలయ్య ఎలా కాపాడాడు ? రైతు కుటుంబంలో పుట్టిన మరో బాలయ్య శ్రీనివాస్ కు అఖండ‌కు ఉన్న లింక్ ఏంట‌న్న‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిం ది అని చెబుతున్నారు. ఇక అఖండ టెక్నికల్ డిపార్ట్మెంట్ ల విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి ఈ సినిమాకు పని చేసినట్టు తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ డైలాగ్ లు అన్ని అదిరిపోయాయి.

అన్నిటికంటే ముఖ్యంగా థ‌మన్ సంగీతం అఖండ సినిమాకు మేజ‌ర్ ఎస్సెట్ అని సిని మా చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. పాటలు విన‌డానికి అంత బాగా లేక‌పోయినా వీటిని థియేట‌ర్ల‌లో చూసిన‌ప్పుడు మాత్రం థ్రిల్ ఫీల్ అవుతా రు. అయితే ఇక అఖండ పాత్రకోసం థ‌మన్ ఇచ్చిన బిజీఎం అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

థ‌మ‌న్ ఈ సినిమా కోసం బిజీఎం ఇచ్చేందుకు ఎంత‌లా ప్రాణం పెట్టి వ‌ర్క్ చేశాడో బీజీఎం చెపుతుంది. అస‌లు అఖండ పాత్ర వ‌స్తుంటే సైడ్ బాక్సుల్లో నుంచి వ‌స్తోన్న ఆ థీమ్స్ ప‌ర్‌ఫెక్ట్ మ్యాచ్ కావ‌డంతో పాటు సినిమా చూస్తోన్న ప్రేక్ష‌కుడు ఆ పాత్ర‌తో లీన‌మై ట్రావెల్ చేసేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: