నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా ఎన్నో సినిమాలు తీసినప్పటికీ ఒకదాని తర్వాత ఒకటి పరాజయాలు అవుతూనే ఉన్నాయి. అంతేకాకుండా హ్యాట్రిక్ డిజాస్టర్ తరువాత బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మూవీ అఖండ. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఈ రోజున విడుదల అయ్యింది. ఇక ఈ మూవీపై ఆడియన్స్ కు ఎక్స్పెక్టేషన్స్ సాలిడ్ గా ఉన్నాయని చెప్పవచ్చు. ఆ ఎక్స్పెక్టేషన్ ను ఈ సినిమా ఎంత వరకు అందుకుంటుందో తెలియాలంటే అది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

మూవీ థియేటర్ అడ్వాన్స్ బుకింగ్, థియేటర్ కౌంటు లెక్కలు అన్నీ బయటకు వచ్చేసాయి. సుమారుగా 925 థియేటర్లలో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతుండగా.. వరల్డ్ వైడ్ గా 1550 థియేటర్లకు పైగా విడుదల అయ్యింది.54 కోట్ల రూపాయలతో బరిలోకి దిగుతోంది ఈ మూవీ. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రెండు మూడు రోజుల నుంచి, అన్ని చోట్ల కొనసాగినప్పటికీ.. ఇప్పటికే టికెట్ల విషయంలో కొన్ని చోట్ల చర్చలు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి.

నిన్నటి రోజు నుంచే అడ్వాన్స్ బుకింగ్ బాగానే జరుగుతున్నాయి. బాలయ్య సీడెడ్ ఏరియాలో, గుంటూరు జిల్లాలో బాగా అడ్వాన్స్ బుకింగ్ జరిగాయని చెప్పవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేటు నార్మల్ కంటే తక్కువగా ఉండటంతో టికెట్స్ మరింత ఎక్కువగా బుకింగ్ అవ్వడం గమనార్హం. నైజాం ఏరియాలో బుకింగ్ సాలిడ్ గా కొనసాగుతుండడంతో బాలకృష్ణ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఓవరాల్ గా ఇప్పటివరకు జరిగిన బుకింగ్స్ విషయానికొస్తే..49% వరకు బుకింగ్స్ జరిగాయి. ఇక ఇప్పటి వరకు అన్ని ఏరియాలలో అఫీషియల్ గా వచ్చిన ప్రకారం.. ఇక ఈ సినిమా మా రిలీజ్ అప్పట్నుంచి ఈ రోజు ముగిసే వరకు కలెక్షన్ల విషయానికి వస్తే సుమారుగా 10కోట్ల రూపాయల వరకు కలెక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరైతే  ఇది నిజమో కాదో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: