నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమా లో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటించ గా, శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఇప్పటికే బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు రావడం తో అఖండ సినిమా పై జనాల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను, టీజర్ లను, పాటలను, ట్రైలర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై జనాలలో ఉన్న అంచనాలను కూడా పెంచాయి, ఇలా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 2 తేదీ అనగా ఈ రోజు విడుదల కాబోతుంది.

అయితే ఇప్పటికే యూఎస్ఏ లో అఖండ షో స్ పడిపోయాయి. అయితే అక్కడి నుండి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అఖండ సినిమా కు పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ సినిమాకు తమన్ అదిరి పోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను మరియు మ్యూజిక్ ను అందించినట్లు కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి.  ఇది ఇలా ఉంటే అఖండ సినిమా  ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం మాస్ మెంటల్ రేంజ్ లో ఉందని, ఈ ఇంటర్వల్ బ్లాక్ కోసం తమన్ సమకూర్చిన బిజిఎం అదిరిపోయే రేంజ్ లో ఉందని తెలుస్తోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే మాస్ అంశాలు ఫుల్ గా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే, అయితే ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంది అని మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ మాత్రం అదిరిపోయింది అని తెలుస్తుంది. దానికి తగినట్టుగానే సినిమా చూసిన కొంత మంది యుఎస్ఎ ప్రజలు కూడా అఖండ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది అంటూ రివ్యూస్ పెట్టేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: