అఖండ... నటరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా. బీ బీ - 3 అంటూ మొదలైన ఈ సినిమాకు ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో అఖండ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత మే నెలలోనే దాదాపు షూటింగ్ పార్ట్ అంతా పూర్తైంది. ముందుగా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు తగినట్లుగానే ప్రమోషన్ వర్క్ కూడా చేసింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. నెమ్మదిగా పాటల విడుదలపై యూనిట్ దృష్టి పెట్టింది. ముందుగా సెప్టెంబర్ 18 అడిగా అడిగా అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేసిన పాటను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అది హిట్ కావడంతో... ఇక సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో బీబీ 3 కాంబినేషన్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు.

ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల అవుతుందని యూనిట్ ప్రకటించిన వెంటనే... బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ సారి మాత్రం విడుదల వాయిదా వేయొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు కూడా చేశారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో బాలయ్య గెటప్, ట్రైలర్‌లో బాలయ్య హావ భావాలు చూసి... అభిమానులు ఫిదా అయ్యారు. ఇక బాలయ్య డైలాగులకు అయితే... చెప్పాల్సిన పని లేదు. ట్రైలర్ విడుదలైన గంటల వ్యవధిలోనే... సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ట్ అయ్యింది. యూ ట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వచ్చేశాయి. ఎప్పుడెప్పుడు డిసెంబర్ 2వ తేదీ వస్తుందా అని కూడా ఎదురు చూశారని అభిమానులు. అదేదో సినిమాలో అన్నట్లుగా లేట్‌ గా వచ్చినా సరే... లెటెస్ట్‌గా వస్తా అంటూ హీరో చెప్పిన డైలాగ్ అఖండకు సరిగ్గా సరిపోతుంది. సింహ, లెజండ్ హిట్‌లతో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్‌గా బాలయ్య, బోయపాటి జోడి... అఖండతో మరోసారి హిట్ కాంబినేషన్‌గా ప్రూవ్ అయ్యింది. మాస్ ఎంటర్ టైనర్‌గా విడుదలైన అఖండ... నందమూరి అభిమానులను కేరింతలు కొటిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: