నందమూరి బాలకృష్ణ చాలా రోజుల తరువాత భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. 'అఖండ' జైత్ర యాత్ర కొనసాగుతుండగా, బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రికార్డులను క్రియేట్ చేసే దిశగా పరుగులు పెడుతున్నాయి. అఖండ కలెక్షన్స్ పరంగా జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు. బాక్సాఫీస్ పై బాలయ్య చేస్తున్న దండ యాత్ర చూస్తుంటే ఇది వరకున్న ఓవర్సీస్ రికార్డులు అన్నీ బ్రేక్ కావడం ఖాయం అనిపిస్తుంది. సోషల్ మీడియా ద్వారా సినిమా బాగుందని, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండూ అదిరిపోయాయి అని, ఇంటర్వెల్ బ్యాంగ్ హైలెట్ అని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ హిట్, బాలయ్య అఘోరా లుక్ అదిరిపోయింది అని బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. అంతేకాదు అఖండ చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకున్నారు అని సోషల్ మీడియా లో నందమూరి ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

ఇక ఏమాత్రం తగ్గేది లేదంటూ అఖండ బాక్సాఫీస్ ను కొల్లగొడుతున్నాడు. ఇప్పటికే ప్రీమియర్ షోను చూసిన ప్రేక్షకులు బాలయ్య అదరగొట్టాడని ప్రశంసలు కురిపిస్తుంటే, ట్రేడ్ విశ్లేషకులు అన్ని దేశాల్లో ఎంత కలెక్షన్స్ రాబట్టింది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా యూఎస్ కలెక్షన్స్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. యూఎస్ఎలో 'అఖండ' ప్రీమియర్ లకు నిన్న రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు 280 కే వసూళ్లు రాబట్టింది అని, అది మరో గంటలో 300 కేకు చేరుకునే అవకాశం ఉందని, లేదంటే మరి కాస్త సమయం పట్టవచ్చని అంటున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ కు, బోయపాటి శ్రీను, దర్శకుడు తమన్, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కి సెలెబ్రిటీ ల నుంచి విషెస్ అందుతున్నాయి. చాలా రోజుల తర్వాత వచ్చిన బాలయ్య బొమ్మ అదిరిపోయింది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: