`అఖండ‌` ఇప్పుడు ఎక్క‌డ చూసిన ఇదే సినిమా గురించే ర‌చ్చ న‌డుస్తోంది. బాల‌య్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూసిన రోజు ఇది.. నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య న‌టించిన అఖండ సినిమా రిలీజయింది. క‌రోనా మ‌హ‌మ్మారి త‌రువాత వ‌చ్చిన పెద్ద సినిమా.. అది కూడా బాల‌య్య, బోయ‌పాటి కాంబోలో వ‌స్తున్న మూడో చిత్రం కావ‌డంతో సినిమా అభిమానులు, బాల‌య్య ఫ్యాన్స్ ఆనందంలో తేలియాడుతున్నారు. ఇప్ప‌టికే బాల‌య్య ఫ‌స్ట్‌లుక్ నుంచి టోజ‌ర్‌, పాట‌లు, ట్రైలర్ అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.


   ఇప్పుడు సినిమా విడుద‌లవ‌డంతో అభిమానుల ఆనంద‌రానికి హ‌ద్దులు లేకుండాపోయాయి. అఖండ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధిస్తుంద‌ని ధీమాతో ఉన్నారు. గ‌త రాత్రి `అఖండ‌` ఓవ‌ర్సీస్‌లో రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప‌లు చోట్ల ప్రివ్యూవేశారు. సినిమా చూసిన ప‌లువురు ప్ర‌ముఖులు, అభిమానులు, ప్రేక్ష‌కులు ట్విట్ట‌ర్ ద్వారా త‌మ అభిప్రాయాలు వెల్ల‌డిస్తున్నారు. `బ్లాక్ బాస్ట‌ర్ కంబో బ్యాక్` అని బాల మామ‌ను చూడడానికి ఆతృత‌గా ఉందంటూ.. లెజెండ్ బాల‌య్య‌, బోయ‌పాటి గారికి శుభాకాంక్ష‌లు అంటూ నారా రోహిత్ ట్వీట్ చేశారు. కంప్లీట్ మాస్ యాక్ష‌న్ లోడెడ్ విత్ బాల‌య్య ఎలిమెంట్స్ అంటూ బీష్మా టాక్స్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది.    బాలయ్య వన్ మ్యాన్ షో అంటూ ప్రేక్ష‌కులు పోస్ట్‌లు చేస్తున్నారు. బాల‌య్య‌, బోయ‌పాటి హ్యాట్రిక్ విజ‌యం అంటూ చెబుతున్నారు. అఖండ సినిమాలో బాల‌య్య విశ్వ‌రూపం చూపించార‌ని.. సినిమా హాళ్ల‌లో ఈట‌లు వేస్తు, ఊగిపోతున్నార‌ని కొంద‌రు సామాజిక మాధ్య‌మాల ద్వారా పోస్టులు పెడుతున్నారు. రొటీన్ స్టోరీయే అయిన‌ప్ప‌టికీ అఖండ సినిమాలో బాల‌కృష్ణ ను ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను అద్భుతంగా  పాత్ర‌కు తగ్గ‌ట్టుగా మ‌ల్చి.. స్క్రీన్‌ప్లే చూపించిన విధానం ఉర్రూత‌లూగిస్తోంద‌న్న టాక్ న‌డుస్తోంది. ఈ సినిమాలో ప్ర‌తికూల పాత్ర‌లో శ్రీ‌కాంత్‌ను ద‌ర్శ‌కుడు బోయ‌పాటి వినూత్నంగా పాత్ర రూపొందించిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి  `అఖండ‌` అదిరిపోయింద‌ని ప్రేక్ష‌కులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: