నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా అఖండ... నందమూరి బాలకృష్ణ కెరీర్ లో కాస్త భిన్నంగా కనిపించిన సినిమాల్లో ఈ సినిమా ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో అంచనాలు ఉండగా ఈ అంచనాలు అన్నీ కూడా సినిమా అందుకుందని నందమూరి బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో ఆయనను కీర్తిస్తున్నారు. ప్రధానంగా బోయపాటి శ్రీను దర్శకత్వం తో పాటు సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం సినిమాకు బాగా కలిసి వచ్చిందని అభిప్రాయాలు చాలావరకు వ్యక్తమవుతున్నాయి.

సినిమాకు సంబంధించి బాలకృష్ణ పూర్తి స్థాయిలో తన నట విశ్వరూపం చూపించిన సినిమాలో కొన్ని కొన్ని పాత్రలు సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చాయి అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాకు సంబంధించి బాలకృష్ణ ప్రతి సన్నివేశంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని నటించారని బోయపాటి శ్రీనుకి తగిన విధంగా బాలకృష్ణ సినిమాలు అన్ని విధాలుగా కూడా తనలో తాను మార్పులు చేసుకున్నారు అని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా విషయంలో నందమూరి బాలకృష్ణ కూడా చాలా అంచనాలు పెట్టుకోగా అభిమానులు చేసిన ప్రచారం సినిమాకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.

దానికి తోడు అల్లు అర్జున్ అభిమానులతో పాటుగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ సినిమాను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాకు సంబంధించి కొన్ని కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి అనేది బాలయ్య అభిమానులు స్వయంగా చెబుతున్న మాట. ప్రధానంగా ఈ సినిమాకు హీరోయిన్ మైనస్ అయిందని ఆమె నటన విషయంలో ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారని తన మొదటి సినిమా కంచే లో ఏ విధంగా అయితే కనిపించిందో ఈ సినిమాలో కూడా అదే విధంగా ఉంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా బాలకృష్ణ కు బాగా ప్లస్ కాగా నటన పరంగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు మైనస్ అని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: