యువరత్న నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ. బాలయ్య నటించిన ఈ సినిమా డిసెంబర్ 2 అంటే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బాలయ్య ఇంకా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు సింహ లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించారు ఆ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత తెరకెక్కించిన సినిమా అఖండ. బాలయ్య నటించిన ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి చి బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు ఇక ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అయింది..

 బాలయ్య ఫాన్స్ అనుకున్నట్టే ఈ సినిమా ఇప్పుడు మంచి ఊపులో ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఇంతకు ముందు వచ్చిన పాటలు టీచర్లు ఒక ఎత్తయితే ఇప్పుడు సినిమా మాత్రం మరో ఎత్తు అనే చెప్పాలి. ఈ సినిమా ఈ రోజు మొదటి షో భ్రమరాంబ, మల్లిఖార్జున థియేటర్లలో పడింది. బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో బాలయ్యను బోయపాటి చాలా పవర్ఫుల్గా చూపించాడని... పోతే ఫస్ట్ హాఫ్ చాలా పవర్ ఫుల్ గా ,ఇంట్రెస్టింగ్గా ఉందని.. సినిమా చూసిన బాలయ్య ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలయ్య మామూలు గెటప్ లలోనే అదర కొడతాడు... అలాంటిది అఘోర గెటప్ లో  ఇరగదీశాడు.

అయితే బోయపాటి ఈ సినిమాలో ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అయిపోయేలా బాలయ్యను ఎలివేట్ చేసారు.దీనితో పాటుగా సినిమా గ్రాఫ్ కూడా  ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు బోయపాటి.వీటితో పాటుగా సినిమాలో ని బాలయ్య  పవర్ ఫుల్ డైలాగ్స్‌ తో , ఎలివేషన్‌ తో  ట్విస్టులతో...సినిమా అదరగొట్టేసారు.సినిమాకి ఇవన్నీ  ఒకెత్తు అయితే తెలంగాణా కళ్ళు దావత్ అనే ఒక  ఎపిసోడ్ ఈ సినిమాలో  ఉంటది..సినిమాలో ఆ ఎపిసోడ్ ని బోయపాటి తనదైన శైలిలో చాలా బాగా చూపించాడు..కల్లు ఎపిసోడ్ ద్వారా బోయపాటి తెలంగాణ దావత్‌కి ప్రాతినిధ్యం వహించడం చాలా చమత్కారంగా - ఫన్నీగా ఉంది మరియు బోయపాటి ట్రేడ్‌మార్క్ సన్నివేశాల్లో చాలా ఎక్కువగా ఉంది.వీటితో పాటు బాలయ్యకు తన తల్లికి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు అందరిని కదిలిస్తుంది. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో ఇది మరో హ్యాట్రిక్ హిట్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: