ప్రగ్యా జైస్వాల్.. మొదటివరకూ ఈమె ఒక సాధారణ హీరోయిన్ గా మాత్రమే గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈరోజు అఖండ మూవీ రిలీజ్ కావడంతో తన పేరు దేశ విదేశాలలో కూడా మారుమ్రోగుతూ ఉండడం గమనార్హం. అఖండ సినిమాలో బాలయ్య ఏ రేంజిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బాక్సాఫీస్ వద్ద థియేటర్లు అభిమానుల హంగామా తో దద్దరిల్లి పోతున్నాయి. చివరకు ప్రగ్యా జైస్వాల్ ఊసే లేని దర్శకులు అఖండ సినిమాలో తీసుకొచ్చి పెట్టారు. ఇక ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి.

మొదటిసారి క్రిష్ దర్శకత్వం వహించిన పీరియాడికల్ డ్రామా సినిమా కంచె లో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాతో ఈమె ఉత్తమ మహిళా డబ్ల్యూ గా ఫిలింఫేర్ అవార్డు లభించడం గమనార్హం. ఈమె సినీ ఇండస్ట్రీలో కి రాక ముందు మోడల్ గా కూడా  పని చేసేది.  ఇక ఆ తర్వాత సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న ఈమె తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ నైతే సొంతం చేసుకుంది అనే చెప్పాలి.


తర్వాత కొన్ని సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా అవకాశాలు అయితే ఈమెకు రాలేదు. రకుల్ ప్రీతిసింగ్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా  నటించిన జానకి నాయక చిత్రంలో అతిథి పాత్ర పోషించింది. ఇక అలా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈమె  మొదటి సారి సూపర్ స్టార్, నటసింహ, యువరత్న రానా వంటి బిరుదు పొందిన బాలకృష్ణ సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగి అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈమె ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పాట విడుదలైనప్పుడు సోషల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది.. ప్రతి ఒక్కరిని మెప్పించగలుగుతాను అని చెప్పింది. ఇక అనుకున్నట్టుగానే ఆమె ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి వరుస ఆఫర్లు పొందడానికి సిద్ధంగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: