కరోన మహమ్మారి తర్వాత  థియేటర్లలో ఏ అతిపెద్ద సినిమా కూడా రాలేదు. కారోనా సెకండ్ వేవ్  తర్వాత మొట్టమొదటిసారిగా థియేటర్లలో విడుదలైన భారీ సినిమా అఖండ. బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో ఇంతకుముందు సింహ లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ...ఆ రెండు సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇదే. బాలయ్య నటించిన ఈ సినిమాకి ఎప్పుడు థియేటర్లలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఎన్నడూ చూడని విధంగా రికార్డు స్థాయిలో ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ లు అయ్యాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ఇంకా ఈ సినిమాలోని పాటల ద్వారా ఈ సినిమా విడుదల అయిన తరువాత ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ ద్వారా సినిమా కి ఒక రేంజ్ లో పాజిటివ్ టాక్ వచ్చింది.

దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. సినిమాలలో బాలకృష్ణ నటన ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే బాలయ్య టాలెంట్ని ఎక్కడ చూపించాలి ఎలా చూపించాలి అని ఈ విషయాన్ని తెలిసిన ఒకే ఒక వ్యక్తి బోయపాటి శ్రీను. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ ఇంట్రో సీన్ గూస్ బంప్స్  వచ్చే లా చూపించాడు బోయపాటి. ఈ సినిమాలో బాలకృష్ణ రాయలసీమ యాసలో మాట్లాడడం జరుగుతుంది అయితే రాయలసీమ యాసలో డైలాగ్స్ తో మైమరిపించారు బాలయ్య. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య డైలాగ్స్ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది అని చెప్తున్నారు సినిమా చూసిన బాలయ్య ఫాన్స్. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో కనిపించాడు... రెండు పాత్రలలోనూ ఏమాత్రం తగ్గకుండా అందరినీ ఆకట్టుకున్నాడు.

కాకపోతే ఈ సినిమాలో బాలయ్య తో పాటుగా శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు. బాలయ్యకు జోడీగా అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ నటించింది హీరో కి ఏమాత్రం తగ్గకుండా అందరినీ ఆకట్టుకుంది. సినిమాలు బాలయ్య ఇంకా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ముఖ్యంగా బాలయ్య ప్రగ్య జైస్వాల్ కాంబినేషన్లో సాగే జై బాలయ్య ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే సరిగ్గా గమనిస్తే ఈ పాటకు చాలా మైనస్ ఉన్నాయి ఈ పాటలో సాంకేతిక నిపుణుల పనితీరు అంత బాగోలేదు పాటలో కనిపించే బాలయ్య కఠినమైన ముఖం నిండు మీసాలు, దాదాపుగా మేకప్ లేదు, డిమ్ లైట్, పేలవమైన కెమెరా పనితనం, అన్‌ప్టింగ్ విగ్స్, S S థమన్ పెప్పీ బీట్, టన్నుల సైడ్ డ్యాన్సర్‌లు, ప్రగ్యా జైస్వాల్ ఓవర్ పెర్ఫార్మెన్స్  ఇవన్నీ మైనస్ అని చెప్పాలి కానీ ఇవన్నీ కనిపించకుండా బాలయ్య ఈ పాటలో మెస్మరైజ్ చేశాడనే చెప్పాలి ఈ పాట మొత్తానికే బాలయ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దీంతో థియేటర్లో ఈ పాటతో అభిమానులు ప్రేక్షకులు ఉర్రూతలూగి పోతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: