తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ మంచి విజయం సాధించిన జోడీల్లో ఒకటిగా చెప్పుకోవ‌చ్చు. హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అఖండ సినిమా కోసం ముచ్చ‌టగా మూడోసారి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి క‌లిసి ప‌ని చేశారు. ఎన్నో హైప్‌ల నడుమ ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అయితే, వీరిద్దరూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారా..? లేదా చూడాలి. సింహా" మరియు "లెజెండ్" చిత్రాల తరువాత, దర్శకుడు బోయపాటి శ్రీ‌ను, బాలకృష్ణతో క‌లిసి మూడవ సినిమాగా అఖండ తీశారు.


 అక్రమ మైనింగ్, పర్యావరణ పరిరక్షణ, హిందూ ధర్మం మొదలైన అంశాలను స్పృశించే రీతిలో అఖండ కథను సిద్ధం చేశారు. బోయపాటి చిత్రంలో కొత్త అంశాలు ఉన్నా కానీ సినిమాను ఏవిధంగా ట్రీట్ చేస్తారో తెలిసిన విష‌య‌మే. నిజానికి చెప్పాలంటే.. బోయపాటి శ్రీ‌ను తన మునుపటి సినిమాల్లో చూపించిన “లెజెండ్” వంటి కథనాన్ని అనుసరించాడ‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.  హీరో డ్యూయల్ రోల్, ఫస్ట్ హాఫ్‌లో కనిపించని పాత్ర ఇంటర్వెల్ పాయింట్‌లో సరిగ్గా వచ్చి ఛార్జ్ తీసుకుంటుంది. . ‘లెజెండ్‌’లో జైదేవ్‌ పాత్ర, ఇక్కడ ‘అఖండ’ కూడా అదే రీతిలో ఉండ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు.


   అయితే, బాల‌య్య అభిమానుల‌కు మాత్రం బోయ‌పాటి శ్రీ‌ను ఫుల్ మీల్స్ పెట్టేశారు. నంద‌మూరి ఫ్యాన్స్ అనుకున్న రేంజ్‌లోనే అఖండ సినిమాను రూపొందించార‌నే టాక్ న‌డుస్తోంది. కానీ, బాల‌య్యను ఎథా విధిగా గ‌తంలోని సినిమాల్లో చూపించిన విధంగానే అగ్రెస్సివ్ క్యారెక్ట‌ర్‌లో నిమ‌గ్నం చేశారు. మొదటి హాఫ్ నుంచి క్లైమాక్స్ వ‌ర‌కు బాల‌కృష్ణ‌ను ఎప్ప‌టి లాగే రొటిన్‌గా చూపించారు. అవే బ‌ల‌మైన డైలాగ్స్, రొటిన్ ఫైట్స్ ఉన్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఎక్క‌డా కూడా క‌థ‌ను ఎలివేష‌న్ చేయ‌కుండా హీరో బాల‌య్య‌ను చూపిస్తూ సినిమా అంతా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి చూపించారు. మొత్తంగా సినిమాకు బాల‌య్య న‌ట‌న‌, డైలాగులు, సంగీతం, విల‌న్ క్యారెక్ట‌ర్ ప్ల‌స్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: