తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ రోజుకు ఒక హీరో మళ్లీ తెర పైకి ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. ఇలా బోలెడు మంది హీరోలు వస్తున్న కానీ తెర పై కొందరు మాత్రం సక్సెస్ కాగలరు. అలా ఇండస్ట్రీలో వచ్చిన అతి తక్కువ కాలంలోనే భారీ విజయాలు నమోదు చేసిన హీరోలల్లో .."నాగ శౌర్య" కూడా ఒకరు. తనలోని టాలెంట్ చూయిస్తూ..విభిన్నమైన స్టోరీలను ఎంచుకుంటూ..ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

డిఫరెంట్ స్టోరీలను చూస్ చేసుకోవడంలో ఎప్పుడు ముందు ఉండే ఈ యంగ్ హీరో..తాజాగా "లక్షా" అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. విలువిద్యా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ట్రైలర్ ఆధారంగా ఈ సినిమా ప్రధానంగా  లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ .. ..చుట్టు తిరుగుతుందని అర్ధమౌతుంది. ఇక ఈ సినిమాను డిసెంబరు 10వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. రేపు కానీ ఎల్లుండి కానీ దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇది ఇలా ఉండగా తాజాగా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో యంగ్ హీరో  నాగశౌర్య మాట్లాడుతూ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న కేతిక శర్మ  పై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈవెంట్ లో ఆయన స్టేజీ పై మాట్లాడుతూ.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని సంవత్సర కాలం నుండి ఎదురు చూస్తూనే ఉన్నాని చెప్పుకొచ్చిన ఆయన.. హీరోయిన్ కేతిక గురించి మాట్లాడుతూ..తనని చూస్తే ఎవరికైనా కూడా రొమాన్స్ చేయాలనిపిస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. రొమాంటిక్ సినిమా ద్వారా వచ్చిన ఈ అమ్మాయిని చూస్తే అలానే అనిపిస్తుంది.. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన సరదాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: