ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా బాలకృష్ణ వన్ మ్యాన్ షో లా ఉంటుంది అని మొదటి నుంచి అందరూ అనుకునే విషయమే. ఈ చిత్రం యొక్క ట్రైలర్ టీజర్ లను చూసిన తర్వాత బాలకృష్ణ మాత్రమే చేయగల కథ ఇది అనిపించక తప్పదు. దానికి తోడు జై బాలయ్య అనే పాటలో ఆయన ఆడి పాడిన తీరు చూస్తే అభిమానులు ఖుషీ అయిపోతారు. బాలయ్య ను ఈ సినిమా లో చూస్తే అభిమానులు రచ్చ చేస్తారు అని అందరూ ముందే ఊహించారు.

ఈ సినిమాలో ఆయన చేసిన పోరాటాలు మరో స్థాయిలో ఉంటాయని అందరూ అనుకున్నారు. బాలకృష్ణ రెండు పాత్రల్లో ఈ సినిమాలో విజృంభించడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాకు కొంత నెగిటివ్ టాక్ రావడం ఇప్పుడు అందరినీ ఎంతగానో కలవరపెడుతుంది. బాలకృష్ణ ఉన్నా కూడా, బాలకృష్ణ డైలాగులు సూపర్ హిట్ అయినా కూడా, ఆయన పోరాటాలు మరో స్థాయిలో ఉన్న కూడా, రెండు పాత్రల్లో అదిరిపోయేలా నటించిన కూడా ఈ సినిమా హిట్ అవ్వడానికి ఏవీ కూడా ఉపయోగపడలేదు.

కథానాయక ప్రగ్యా జైస్వాల్ అలాగే పూర్ణ పాత్ర ల మధ్య వచ్చే సీన్లు తప్ప మిగతా వన్నీ కూడా బాలకృష్ణ ను హైలెట్ చేయడానికి వచ్చాయి. తన సినిమాలో బోయపాటి శ్రీను తప్పకుండా మాస్ ప్రేక్షకులను అలరించే అంశాలను ఉండేలా చూసుకుంటాడు కానీ అవే ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ అయ్యాయి అని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు బాగా పండక పోవడం  ఈ చిత్రంకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడానికి కారణం అని అంటున్నారు. తమన్ సంగీతం అదిరిపోయేలా ఉన్న కూడా అది ఈ చిత్రాన్ని ఏ మాత్రం కాపాడలేకపోయింది. దాంతో బోయపాటి శ్రీనుకు వరుసగా మరో ఫ్లాప్ వచ్చినట్లు అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: