నందమూరి బాలకృష్ణ సినిమా అంటే యాక్షన్ మాత్రమే కాదు ఆ సినిమాలో ఎమోషన్ కూడా చాలా బాగుంటుంది. అందుకే ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాలు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించాయి. తన సినిమాలో అన్ని అంశాలతో పాటు సెంటిమెంట్ కూడా మేళవించి ప్రేక్షకులకు అందించడం బాలకృష్ణ స్పెషాలిటీ ఆ విధంగా ఆయన ఎంతటి మాస్ చిత్రాలు చేసిన దానిలో సెంటిమెంట్ పాళ్లు కాస్త ఎక్కువే జోడించి ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటాడు.

తాజాగా ఆయన హీరోగా నటించిన అఖండ సినిమా కేవలం మాస్ సినిమాగా మాత్రమే కాకుండా అది మంచి ఎమోషనల్ చిత్రంగా కూడా ఉండబోతుందని అందరూ అనుకున్నారు. అంతేకాదు ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరిస్తుందని అందరూ భావించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన ఈ మూడో సినిమా ఆయన గత రెండు సినిమాల విషయంలో పండించిన ఎమోషన్ తప్పకుండా పండించబోతుందని అందరూ అనుకున్నారు.

అయితే ఆయా సినిమాలలో ఉన్న ఎమోషన్ ఈ సినిమా లలో పెద్దగా లేదు అనే వార్తలు ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలకృష్ణ రెండు పాత్రలో ఎమోషన్స్ ని బాగా పండించే ప్రయత్నం చేయగా అవి కావాలని పెట్టినట్లు, సీన్ కి సీన్ కి మధ్య ఇరికించినట్లు ఉండడం ఒక్కసారి గా నందమూరి అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. తాము ఊహించింది ఒకటైతే ఇక్కడ చూపించింది మరొకటి అంటూ వారు కొన్ని కామెంట్స్ కూడా పెట్టి సినిమా లో ఎమోషనల్ సీన్ లు పెద్దగా పండలేదనే చెబుతున్నారు.  తనదైన నటనతో సినిమా మొత్తాన్ని భుజాల మీద వేసుకొని నటించిన బాలకృష్ణ ప్రతి పాత్రలోనూ వేరియేషన్స్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇదే సినిమా ను మరో స్థాయికి తీసుకు వెళ్ళాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: