బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'అఖండ' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా కూడా అంతకుమించి రేంజ్లో ఉంటుందని అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు అఖండ థియేటర్లో విడుదలైంది. ఈరోజు ఉదయం నుంచే ఈ సినిమా బెనిఫిట్, ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి.

 వీటితో పాటు యు. ఎస్ లో కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. బాలయ్య ఫాన్స్, ఆడియన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. పక్కా కమర్షియల్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా అఖండ థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది.ఈ సినిమాలో అగోర పాత్ర , యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయని టాక్ వస్తోంది. మరోసారి ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించాడు. ఇక ఈ సినిమాకి మెయిన్ హైలైట్ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. నిజం చెప్పాలంటే ఈ సినిమా మొత్తం ఒకెత్తు అయితే సినిమాకి థమన్ కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు అనే చెప్పాలి.

 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ రేంజ్ లో లేకపోయి ఉంటే సినిమా అంత బాగా ఎలివేట్ అయి ఉండేది కాదేమో. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ బాలయ్యను మర్చిపోయి తమన్ నే హైలెట్ చేస్తున్నారు. తన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తమన్ ఈ సినిమాకు ప్రాణం పోశాడు అని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎక్కడ చూసినా థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా అఘోర పాత్రలో బాలయ్య ఎలివేషన్స్ సీన్స్ కి థమన్ కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే థియేటర్లో పూనకాలు తెప్పించే విధంగా ఉందని చెబుతున్నారు. అందుకే తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముందు బాలయ్య నటన తేలిపోయిందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో బాలయ్యకి బోయపాటికి ఏమో కానీ తమన్ కి మాత్రం ఓ రేంజ్ లో గుర్తింపు వచ్చే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: