నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా, టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన  సినిమా అఖండ, ఈ సినిమా లో ముద్దు గుమ్మలు ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటించ గా శ్రీకాంత్ అఖండ సినిమా లో ప్రతినాయకుడి పాత్ర లో నటించాడు. ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ, లెజెండ్ లాంటి రెండు మాస్ పవర్ ఫుల్ సినిమాలు రావడం తో ఈ సినిమా పై జనాలు ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దానికి తగినట్టు గానే ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై ఇటు సామాన్య ప్రేక్షకులతో పాటు, అటు బాలకృష్ణ అభిమానులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇలా జనాలు ఎన్నో అంచనాలు పెట్టుకున్న అఖండ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో విడుదలయ్యింది.

ఇది ఇలా ఉంటే సినిమా విడుదలకు ముందు చాలా వరకు స్టార్ హీరోలు, దర్శకులు తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు పలు మీడియా చానల్ ఇంటర్వ్యూ లలో, సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తమ సినిమాను ప్రమోట్ చేస్తూ ఉంటారు, కానీ అఖండ సినిమా విషయం లో మాత్రం అది ఎక్కువగా జరగలేదు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మాత్రం భారీగా చేసి, ఆ తర్వాత మాత్రం చిత్ర బృందం చాలా వరకు సైలెంట్ అయిపోయింది. దీనికి ప్రధాన కారణం.. ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహా, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బాస్టర్ విజయాలు రావడంతో అఖండ సినిమాకు ఏ విధమైన ప్రమోషన్ అవసరం లేదు అని, జనాల్లో ఈ సినిమాపై ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని, అది ఈ సినిమాకు సరిపోతుంది అనే భావనలో అఖండ చిత్ర బృందం ఉండి ఉంటుంది అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: