బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'అఖండ'. సుమారు 70 కోట్ల భారీ బడ్జెట్ తో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. బోయపాటి బాలయ్య కాంబోలో సినిమా అంటే ఎలా ఉండాలో అంతకు మించి అఖండ సినిమా ఉందని చెబుతున్నారు. ఇక నందమూరి అభిమానులు, మాస్ ఆడియన్స్ ఈ సినిమాకి విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే సినిమాలో బోయపాటి.. బాలయ్యను రెండు పాత్రల్లో చాలా పవర్ ఫుల్ గా చూపించాడు.

 ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే అగోర పాత్రలో బాలయ్య తన విశ్వరూపం చూపించాడు. ఇక బోయపాటి తనదైన మార్క్ లో అఘోర పాత్రని హై లెవెల్ లో ఎలివేట్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాతో హీరో శ్రీకాంత్ ని మెయిన్ విలన్ గా మార్చేశాడు. గతంలో బాలయ్య నటించిన లెజెండ్ సినిమాతో జగపతి బాబు ని ఒక్కసారిగా విలన్ గా మార్చాడు బోయపాటి. ఆ సినిమాలో జగపతి బాబు విలనిజం అద్భుతంగా పండింది. అక్కడితో జగపతిబాబు కాస్త అన్ని ఇండస్ట్రీలో విలన్ గా బిజీ అయిపోయాడు. అయితే ఇప్పుడు శ్రీకాంత్ ను కూడా అదే రేంజ్ లో ఎలివేట్ చేయడానికి అఖండ సినిమాలో విలన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. సినిమాలో శ్రీకాంత్ వరదరాజులు అనే పాత్రను పోషించాడు.

అయితే శ్రీకాంత్ మాత్రం ఈ సినిమాలో తన పాత్ర పరిధి మేర నటనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అయితే ఈ పాత్రను డిజైన్ చేయడంలో బోయపాటి ఓ రకంగా చూసుకుంటే విఫలమయ్యాడని అంటున్నారు. లెజెండ్ రేంజ్లో అఖండ సినిమాలో విలనిజం పండలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే లెజెండ్ సినిమాలో జగపతిబాబు విలనిజం కొన్ని కొన్ని సన్నివేశాల్లో హీరో ని డామినేట్ చేస్తోంది. ఆ మ్యాజిక్ అఖండ సినిమాలో అది శ్రీకాంత్ విలనిజంలో కనిపించలేదని అంటున్నారు. అయితే శ్రీకాంత్ మాత్రం బోయపాటి డిజైన్ చేసిన పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నాడు. జగపతి బాబు విలనిజంతో పోల్చుకుంటే అఖండ లో శ్రీకాంత్ ఆయన విలనిజాన్ని మ్యాచ్ చేయలేదనే చెప్పాలి. అయితే ఇది ఒక రకంగా దర్శకుడు తప్పిదమే అని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: