నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం అఖండ నేడు థియేటర్లలోకి రానే వచ్చింది. కాగా ఈ సినిమా ఎలా ఉంది, టాక్ ఏంటి అంటే..?? ఫ్యాన్స్ కు బోయపాటి ఆశించిన ట్రీట్ ఇచ్చేసారనే అంటున్నారు. ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ విజయవంతం అయ్యిందనే చెబుతున్నారు. ఈ మాట ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ చూసిన సినీ ప్రేక్షకుల కూడా ఇదే మాట చెబుతున్నారు. బాలయ్య అకౌంట్ లోకి మరో బ్లాక్ బస్టర్ పడినట్లే అంటూ నీరాజనాలు పలుకుతున్నారు. మొత్తానికి టాలీవుడ్ స్క్రీన్ ని పలకరించిన ఈ మూవీ మంచి ఓపెనింగ్స్ తో ప్రారంభం అవ్వడం సంతోషకరమైన విషయం.

బిబి కాంబోకి ఈ మూవీ హ్యాట్రిక్ విజయాన్ని అందించిందనే టాక్ గట్టిగానే వినబడుతోంది. ఇక ఎస్ ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల హృదయాలను  తాకిందని టాక్. మొత్తానికి బాలయ్య డ్యుయల్ రోల్ తో డబుల్ మీల్ అందించారని టాక్ వినపడుతోంది. ఇదిలా ఉండగా కొందరు ఫ్యాన్స్ ఈ విషయాన్ని రాజకీయాలకు ముడిపెడుతూ బాలయ్య కు జేజేలు పలుకుతున్నారు. కొందరు బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద అఖండ మూవీ సూపర్ హిట్టు అంటూ సందడి చేస్తున్నారు.

కానీ ఎక్కువగా నందమూరి ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే సినిమా ఎలా ఉంది అనేది తెలియాలంటే ఇంకా మూడు రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ కాలంలో మంచి మంచి సినిమాలు కూడా విజయమా అపజయమే అనేది అవి రాబట్టే వసూళ్ళ మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి ఎంత కలెక్షన్స్ సాధిస్తుంది అనేది చూడాలి. అయితే ఓపెనింగ్ కలెక్షన్స్ మాట పక్కన పెడితే ఫుల్ రన్ లో ఎంత వసూళ్లు వస్తాయి అనే విషయంపై ఫ్యాన్స్ అందరూ ఆలోచిస్తున్నారు. అఖండ సక్సెస్ కావాలంటే టార్గెట్ రీచ్ అవ్వాలి, మరి అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: