మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'అఖండ' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ఇప్పుడు మాస్ ఆడియన్స్కి నందమూరి అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో బాలయ్య యాక్షన్ సన్నివేశాలు, అఘోర పాత్రలో ఆయన నటన తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని అంటున్నారు.

ఇక సినిమా సెకండాఫ్ మొత్తం అఘోర పాత్రలో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించాడని సెకండాఫ్ అంతా బాలయ్య మాస్ జాతర నడుస్తోందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో బోయపాటి కూడా తనదైన మార్క్ డైరెక్షన్ చూపించాడు. అయితే ఇదిలా ఉంటే ఈ సినిమాపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు బోయపాటి పై కొన్ని నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే.. అఖండ సినిమా కంటే ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బోయపాటి వినయ విధేయ రామ అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మిగిలింది. 

సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఆ సినిమాలో మితిమీరిన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, బోయపాటి చూపించిన విధానం కూడా చాలా ఓవర్ గా ఉందని వాదనలు వినిపించాయి. ఇక ఇప్పుడు తాజాగా విడుదలైన అఖండ సినిమాలో చూస్తే వినయ విధేయ రామ సినిమా కంటే మించిన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. ఇంకా చెప్పాలంటే అఖండ లో బోయపాటి సెకండాఫ్ మొత్తాన్ని యాక్షన్ సన్నివేశాలతో నింపేసాడు. అవి కూడా మితిమీరి ఉన్నాయని చెబుతున్నారు. అయితే అలా ఉన్న కానీ ఇప్పుడు అఖండ సినిమాకు ఎక్కడ చూసినా బ్లాక్బస్టర్ టాప్ నడుస్తోంది. ఈ విషయం లో మెగా ఫాన్స్ హర్ట్ అయ్యారు. మా హీరో రామ్ చరణ్ చేస్తే డిజాస్టర్..అదే బాలయ్య చేస్తే బ్లాక్ బస్టరా అని బోయపాటి పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కొందరు మెగా అభిమానులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: