టాలీవుడ్ అతి పెద్ద డౌట్ లో ఉందిపుడు. దానికి జవాబు కొన్ని నెలలుగా దొరకడంలేదు. అలాగని రిస్క్ చేయాలీ అంటే కూడా కష్టమైన విషయం. దాంతో అలా వెయిట్ చేస్తూ ఉంది. ఈ నేపధ్యంలో వచ్చిన బాలయ్య అఖండ మూవీ టాలీవుడ్ కి కొత్త ఆశలు నింపేలా చేసింది. 

కరోనా ముందు నాటి పరిస్థితులను ఈ మూవీ కలుగచేసింది అనడంలో సందేహం లేదు. ఒకపుడు సినిమా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా, కటౌట్లకు పాలాభిషేకాలు, కోలాహలాలు, పండుగ వాతావరణం ఇవన్నీ కూడా కనిపించేవి. కరోనా తరువాత ఆ సీన్ లేకుండా పోయింది. నిజానికి జనాలు థియేటర్లకు రాని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపధ్యంలో దూసుకువచ్చిన అఖండ మూవీ ధియేటర్ల వద్ద మోత మోగిస్తోంది. ఫస్ట్ డే సినిమా హాళ్ళ వద్ద సందడి చూసినా వీకెండ్స్ కి టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్న తీరు చూసినా కూడా బొమ్మకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయన్న నమ్మకం కలిగింది.

నిజానికి అఖండ మూవీ గురించి టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా చూసింది. ఈ మూవీ ని లిట్మస్ టెస్ట్ గా కూడా భావించింది. ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా  సినీ ప్రముఖులు పరిస్థితులను బేరీజు వేసుకుంటున్నారు. నిజానికి థియేటర్లకు జనాలు పెద్ద సినిమా విడుదల అయితే మామూలుగా వస్తారా రారా అన్న డౌట్లను పటాపంచలు చేస్తూ అఖండ గట్టిగానే గర్జించాడు. మొత్తానికి ఈ మూవీ ఇచ్చిన ధైర్యంతో ఇక వరసబెట్టి సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉంటాయని చెప్పవచ్చు. అసలు అఖండతో సందడి మొదలైంది. ఈ ఊపు అలా సమ్మర్ దాకా కంటిన్యూ అవడం ఖాయమని చెబుతున్నారు. ఎందుకంటే చాలా పెద్ద సినిమాలు, మీడియం రేంజి మూవీస్ కూడా లైన్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా జనాలను థియేటర్లకు రప్పించేవే అంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: