నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన పవర్ ఫుల్ మాస్ సినిమా అఖండ, ఈ చిత్రం లో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటించగా శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించాడు. ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సింహ, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదిరి పోయే బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించడం మాత్రమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించాయి, ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా అదిరిపోయే రేంజ్ విజయాలు సాధించడంతో అఖండ సినిమా పై జనాల్లో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు గానే ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన టీజర్, ట్రైలర్, పాటలు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో అఖండ మ రో మాస్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది అని బాలకృష్ణ అభిమాను లతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే ఇలా ఇప్పటికే అనేక అంచ నాలను క్రియేట్ చేసిన అఖండ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది, ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఏ విధంగా అయితే మాస్ ప్రేక్షకులను అలరించాయో, అఖండ సినిమా కూడా అదే రేంజ్ లో మాస్ ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ను అందిస్తుంది. అలాగే ఈ సినిమా లో అదిరి పోయే ఫైట్ సన్నివేశా లకు తమన్ ఇచ్చిన బి జి యం సూపర్ గా ప్లస్ అయింది అని చెప్పవచ్చు. ఇది మాత్రమే కాకుండా నందమూరి నటసింహం బాలకృష్ణసినిమా లో రెండు వై విధ్యమైన పాత్రల్లో జనాలను అలరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: