నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా అఖండ, ఎన్నో అంచనాలతో భారీ ఖర్చు తో ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించగా, ఈ సినిమా లో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటించారు, ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో శ్రీకాంత్ నటించాడు. ఇప్పటికే బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహా, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కడం తో ఈ హైడ్రిక్  సినిమాపై ఇటు సాధారణ ప్రేక్షకులతో పాటు, అటు బాలకృష్ణ అభిమానులు కూడా ఈ సినిమా మరో మాస్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది అని మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగినట్టు గానే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ లు కూడా అదిరిపోయే మాస్ రేంజ్ లో ఉండడంతో ఈ సినిమా ఖచ్చితంగా ఒక అదిరిపోయే సినిమా అవుతుంది అని చాలా మంది భావించారు.

 ఇలా ఇప్పటికే జనాల్లో ఫుల్ అంచనాలను క్రియేట్ చేసిన అఖండ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తం గా భారీ ఎత్తున విడుదల అయ్యింది, అయితే ఈ సినిమా విడుదలకు ముందు అఖండ చిత్ర బృందం పెద్దగా ప్రమోషన్ చేయలేదు. భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించి దాని తో పెట్టేసుకున్నారు. బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను ఇతర చిత్ర బృందం ఎక్కువగా మీడియా మరియు సోషల్ మీడియా లో చురుగ్గా పాల్గొనలేదు. అలాంటి సమయం లో నే ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమో షన్ లను ఇటు మీడియా ద్వారా అటు సోషల్ మీడియా ద్వారా చేస్తూ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: