నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమాకు టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి అత్యధిక ఖర్చుతో నిర్మించాడు, ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాలను సాధించడం మాత్రమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించాయి, ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా కావడంతో అఖండ సినిమాపై జనాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగినట్లు గానే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్, ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడం తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి, ఇలా జనాల్లో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

ఈ రోజు అఖండ మూవీ విడుదల కావడం తో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ ల దగ్గర సందడి మొదలైంది, అటు అమెరికా... ఆస్ట్రేలియా ఇతర దేశాల్లోనూ అఖండ సినిమా మాస్ జాతర మొదలైంది. ఇక తాజా గా ఓవర్సీస్ ‏లో అత్యధిక ప్రీమియర్ గ్రాసర్ గా అఖండ సినిమా నిలిచింది. ఏకంగా మూడు లక్షల డాలర్ లకు పైగా కేవలం ప్రీమియర్ షో ల ద్వారానే అఖండ సినిమా రాబట్టింది. ఈ స్థాయి లో ఈ సంవత్సరం ఏ సినిమా వసూళ్లను సాధించలేకపోయాయి. ఇది ఇలా ఉంటే ఒక్క రోజే మూడు లక్షల డాలర్ ల వసూళ్ల ను రాబట్టిన అఖండ సినిమా లాంగ్ రన్ ‏లో రెండు మిలియన్ ల డాలర్ ల వరకు వెళ్తుందని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. ఇక తాజా గా.. అమెరికా అయినా.. ఆస్ట్రేలియా అయినా.. ఆంధ్ర అయిన.. తెలంగాణ అయినా మాస్ జాతర కొనసాగుతుందంటూ అఖండ చిత్ర యూనిట్ పోస్టర్స్ విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: