నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమాలో ముద్దు గుమ్మలు ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటించగా, శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.ఎంతో ఖర్చు తో ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు, ఇది ఇలా ఉంటే ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలను సాధించడం తో అఖండ సినిమా పై బాలకృష్ణ అభిమానులతో పాటు మామూలు జనాలలో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.  దానికి తగినట్టు గానే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో అఖండ సినిమా మరో  సింహ, లెజెండ్ రేంజ్  బ్లాక్ బస్టర్ అవుతుంది అని బాలకృష్ణ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ రేంజ్ అంచనాలను కలిగి ఉన్న అఖండ సినిమా ఈ రోజు థియేటర్ లలో విడుదలయ్యింది.

థియేటర్ లలో విడుదల అయిన మొదటి షో నుండే ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది, అయితే అఖండ సినిమా రెస్పాన్స్ చూసిన తెలుగు స్టార్ హీరోలు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ పోతినేని సోషల్ మీడియా వేదికగా అఖండ సినిమా గురించి స్పందించారు. అఖండ సినిమా తో అద్భుతమైన ఆరంభం, చాలా సంతోషం గా ఉంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కి అఖండ చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ అని సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. రామ్ పోతినేని కూడా అఖండ విజయం మీద స్పందించాడు. అఖండ సినిమా గురించి అద్భుతమైన స్పందన వినిపిస్తుంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను, ద్వారకా క్రియేషన్స్, తమన్,  ప్రగ్యా జైస్వాల్ అందరికీ కంగ్రాట్స్. తెలుగు సినిమా వేవ్ మళ్లీ మొదలైంది అని రామ్ పోతినేని సోష ల్ మీడియా వేదికగా స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: