ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై డాన్స్ రియాలిటీ షో గా  మారిపోయింది ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో. దాదాపు 13 ఏళ్ల నుంచి బుల్లి తెర పై అసలు సిసలైన డాన్స్ షో గా కొనసాగుతోంది. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంటర్ టైన్మెంట్ పంచుతుంది. అయితే ఒకప్పుడు ఢీ కార్యక్రమంలో  కేవలం డ్యాన్సులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఈ కార్యక్రమంలో అంతకుమించి అనే రేంజ్లో ఎంటర్టైన్మెంట్ కూడా అందుతూ ఉండడం గమనార్హం. దీంతో ప్రస్తుతం ఢీ కార్యక్రమం ఎంతో సక్సెస్ఫుల్గా బుల్లితెరపై కొనసాగుతోంది. ఇక ప్రతీ వారం కూడా ఎంతో వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది ఈ కార్యక్రమం. అయితే ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ 13వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఏకంగా గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఢీ షో లో గ్రాండ్ ఫినాలే కి ఒక స్పెషల్ గెస్ట్ ఆహ్వానించడం జరుగుతుంది.ఈ క్రమంలోనే ఈసారి కూడా గ్రాండ్ ఫినాలే ని మరింత గ్రాండ్ గా జరపడానికి ఐకానిక్ స్టార్  అల్లు అర్జున్ ని ఆహ్వానించారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఎంట్రీ కి సంబంధించి ఇప్పటికే పలు ప్రోమోలను విడుదల చేశారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రోమో కాస్త బుల్లితెర ప్రేక్షకులందరికీ పూనకాలు తెప్పిస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక ఇటీవలె అల్లు అర్జున్ ఎంట్రీకి సంబంధించి ఒక పూర్తి స్థాయి ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో లో భాగంగా అల్లు అర్జున్ స్టేజ్ మీదకి వచ్చి అందరితో కలిసి పోతూ మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తనదైన శైలిలో పంచులు వేస్తూ ఉంటారు అల్లు అర్జున్. అక్కడున్న కమెడియన్స్ మీద మాత్రమే కాకుండా.. జడ్జిల మీద కూడా పంచులు వేస్తూ అలరిస్తూ ఉంటారు. అల్లుఅర్జున్ ఎంతో స్పాంటేనియస్గా పంచులు వేస్తూ ఉండడంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: