టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ సినిమా అఖండ నేడు విడుదలైంది. గతంలో బాలయ్య తో సింహా, లెజెండ్ వంటి సినిమాలు తీసి సూపర్ హిట్స్ కొట్టిన మాస్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను తీసిన ఈ సినిమా నుండి కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్ని కూడా మూవీ పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా విపరీతమమైన అంచనాలు పెంచాయి. అలానే ఇటీవల కరోనా సెకండ్ వేవ్ తరువాత విడుదలవుతున్న భారీ సినిమా కావడంతో దీనిని ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూస్తామా అంటూ అటు ప్రేక్షుకులైతే మరింతగా ఉవ్విళ్ళూరసాగారు.

ఇక ఎన్నో అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అఖండ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అయితే అందుకోలేకపోయింది అనే చెప్పాలి. ముఖ్యంగా గతంలో బోయపాటి తీసిన సింహా, లెజెండ్ మాదిరిగా ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు పాత్రల్లో కనిపించారు. వాటిలో ఒకటి రైతు పాత్ర కాగా మరొకటి అఘోరా క్యారెక్టర్. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు.

ముఖ్యంగా సినిమాలో ఎక్కువగా రక్తపాతంతో పాటు భారీ యాక్షన్ సీన్స్ ఉండడం, అలానే సినిమాకి మంచి కథని ఎంచుకున్న బోయపాటి దాని యొక్క మెయిన్ పాయింట్ పై ఎక్కువగా దృష్టి పెట్టకుండా కేవలం మాస్ అంశాలనే తీసారని, హీరోయిన్ సహా ఇతర పాత్రలకి అంతగా ప్రాధాన్యత పెద్దగా లేదని, అలానే సినిమాలో ఆకట్టుకునే స్థాయిలో ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ సన్నివేశాలు లేకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశం తక్కువ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎక్కువగా బాలయ్య ఫ్యాన్స్ ని టార్గెట్ చేసేలా దర్శకుడు బోయపాటిసినిమా తీసారేమో అని అనిపించకమానదు. మరోవైపు కాలం మారుతూ ఎందరో యువ దర్శకుడు చిత్ర పరిశ్రమకు వస్తూ సరికొంత కథలు తీస్తుంటే పక్కా రొట్ట రొటీన్ కథ, కథనాలను తీసుకుని బోయపాటిసినిమా తీసారని మరికొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: