ఇటీవల కెరీర్ పరంగా ఒకింత ఢీలా పడ్డ బాలయ్య ప్రస్తుతం బోయపాటి తో చేసిన సినిమా అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ఆకట్టుకునే టాక్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ అన్ని కూడా మూవీపై భారీగా అంచనాలు పెంచడం జరిగింది.

అయితే మూవీ మాత్రం తాము ఆశించే స్థాయిలో లేదని, సినిమాలో ఎక్కువగా మాస్ ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు జొప్పించిన దర్శకుడు బోయపాటి శ్రీను, గతంలో బాలయ్య తో తీసిన సింహా, లెజెండ్ ల మాదిరిగా దీనిని ఆ స్థాయిలో ఆకట్టుకునేలా తెయలేకపోయారని అంటున్నారు ప్రేక్షకులు .ఇక ఈ సినిమాలో మధ్యతరగతి రైతుగా అలానే అఖండ అనే అఘోరాగా రెండు రకాల పాత్రలు పోషించిన హీరో బాలయ్య రెండు పాత్రలను కూడా అదరగొట్టారు అనే చెప్పాలి. ఇక అఖండ రోల్ లో ఆయన పెర్ఫార్మన్స్ తో పాటు పలికిన పలు డైలాగులు అందరినీ ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

మీసం తిప్పలన్నా, తొడ గొట్టాలన్నా, అదిరిపోయేలా డైలాగ్స్ అదరగొట్టాలన్నా బాలయ్యకే చెల్లింది. ఆ విధంగా ఈ అఖండ సినిమాలో తన మార్క్ స్టైల్, పెరఫార్మన్స్, డైలాగ్స్ తో అందరి మనసులు కొల్లగొట్టారు బాలయ్య. అలానే పలు సీన్స్ లో డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ఇక ఈ సినిమాలోని జై బాలయ్య సాంగ్ కోసం ఆయన చేతికి చిన్న గాయం కూడా తగిలింది. ఆ విధంగా అఖండ మూవీ మొత్తాన్ని తన భుజాన వేసుకుని రెండు పాత్రల కోసం ఎంతో కష్టపడ్డారు బాలయ్య. అయితే అఖండ సాధారణ ఆడియన్స్ ని ఆకట్టుకోనప్పటికీ బాలయ్య ఫ్యాన్స్ తో పాటు మాస్ సినిమాలని ఇష్టపడే వారిని మాత్రం ఆకట్టుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: