ఒమైక్రాన్ వైరస్ గురించి వార్తలు ఎలా ఉన్నా ఈసారి టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సంక్రాంతి సినిమాల రేస్ గురించే అందరూ దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే ఈ సంక్రాంతి రేస్ కు ‘ఆర్ ఆర్ ఆర్’ ‘భీమ్లా నాయక్’ ‘రాథే శ్యామ్’ లు తమ డేట్స్ ను ప్రకటించారు.


అయితే ఇప్పుడు ఈ సినిమాలు చాలవు అన్నట్లుగా నాగార్జున ‘బంగార్రాజు’ కూడ సంక్రాంతి రేస్ లోకి రావడం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కొన్ని రోజుల క్రితం నాగార్జున మేనకోడలు నిర్మాత సుప్రియ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంక్రాంతికి మూడు సినిమాలు లైన్ లో ఉండగా నాల్గవ సినిమాకు చోటు దొరకదని కామెంట్స్ చేస్తూ వీటిలో ఏ సినిమా వెనక్కి తగ్గినా తమ సినిమా వచ్చేస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది.


అయితే ఇప్పుడు ఏసినిమా వెనక్కి తగ్గిందో తెలియదు కానీ ‘బంగార్రాజు’ మాత్రం డేట్ లాక్ చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ‘బంగార్రాజు’ మూవీ విడుదల డేట్ జనవరి 15న ఖరార్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తూ ఉండటంతో పాటు రమ్యకృష్ణ కృతి శెట్టి లు నటిస్తూ ఉండటంతో ఫ్యామిలీ ప్రేక్షకులు అంతా తన సినిమాకు వస్తారని నాగ్ అంచనా అని అంటున్నారు.


దీనితో సంక్రాంతి రేస్ లో ఉన్న ‘భీమ్లా నాయక్’ వెనకడుగు వేస్తుందా అంటూ వస్తున్న వార్తలు పవన్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో వారంతా తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉంటే ‘భీమ్లా నాయక్’ షూటింగ్ ఇంకా కొనసాగుతోందని ఈమూవీ షూటింగ్ డిసెంబర్ రెండవ వారానికి కానీ పూర్తి కాదు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎదో ఒక కారణంతో ‘భీమ్లా నాయక్’ వెనకడుగు వేస్తే సంక్రాంతి సీజన్ మిస్ అవుతుంది కదా అంటూ అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నట్లు తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: