సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు చాలానే వచ్చాయి. అయితే వాటన్నింటిలో రాజకీయ నేపథ్యాన్ని కాస్త విభిన్నంగా చూపిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన చిత్రం 'రంగం'. పొలిటికల్ మీడియా థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ తమిళ సినిమా తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంది. తమిళంలో 'కో' అనే పేరుతో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈమధ్య కరోనాతో మరణించిన లెజెండరీ సినిమాటోగ్రాఫర్ అగ్ర దర్శకుడు కె.వి.ఆనంద్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. రాజకీయాల పై మీడియా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది. మీడియా తలచుకుంటే రాజకీయాలను ఎంతవరకు తీసుకెళ్తుంది అనే కథనంతో..

 ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించారు కె.వి.ఆనంద్. ఇక ఈ సినిమాలో జీవా సరసన కార్తీక,పియా భాజ్ పాయ్ హీరోయిన్స్ గా నటించగా, కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, అజ్మల్ ఇతర కీలక పాత్రలో కనిపించారు. సినిమాలో జీవ ఓ జర్నలిస్టుగా అద్భుతమైన నటనను కనబరిచాడు. తెలుగులో విజయం సాధించడమే కాకుండా హీరో జీవా కి టాలీవుడ్ లో మార్కెట్ ఓపెన్ చేసిన సినిమా కూడా ఇదే. 2011లో విడుదలైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ వసూళ్లను అందుకుంది. ఈ సినిమా తెలుగులో నాలుగు కోట్లకు పైగా మాత్రమే థియేట్రికల్ బిజినెస్ చేసింది. కానీ ఎవరూ ఊహించని స్థాయిలో ఈ సినిమా ఏకంగా 11 కోట్ల షేర్ ని రాబట్టి అందుకని అందర్నీ ఆశ్చర్యపరిచింది.

దాని ద్వారా దాదాపు ఏడు కోట్లకు పైగానే బయ్యర్లకు లాభాలను అందించింది ఈ తమిళ సినిమా. తెలుగు లో ఎలాంటి మార్కెట్ లేని ఒక తమిళ హీరో కి ఈ రేంజి కలెక్షన్స్ అందుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా విజయంతో తెలుగులో కూడా జీవా కి మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ ధైర్యంతో అప్పటినుంచి జీవ నటించే ప్రతి తమిళ సినిమా తెలుగులో డబ్ అవుతూ విడుదలయ్యేది. కానీ తెలుగు లో జీవ సినిమాలు ఎన్ని విడుదలైన రంగం సినిమా కి వచ్చిన గుర్తింపు ఏ సినిమాకి రాలేదు. ఇక ఈ సినిమాకి మరో మేజర్ హైలెట్ హరీష్ జయరాజ్ అందించిన సంగీతం. తెలుగులో ఈ సినిమా హిట్ అవడానికి ఒక కారణం సినిమా పాటలు అనే చెప్పాలి. మొత్తం మీద రాజకీయంతో జర్నలిజాన్ని మిక్స్ చేస్తూ దర్శకుడు కె.వి.ఆనంద్ తెరకెక్కించిన రంగం సినిమా తమిళ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: