ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు అప్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా సినిమా నుంచి 'నాటు నాటు' అంటూ ఓ మాస్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాట ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈ పాట ప్రభంజనం సృష్టించింది. ఇక తెలుగు తో పాటు అన్ని భాషల్లో విడుదలైన ఈ పాట యూట్యూబ్లో ఇటీవలే 80 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది. ఇక తాజాగా నాటు సాంగ్ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. యూట్యూబ్లో ఈ పాటకు ఏకంగా వన్ మిలియన్ లైక్స్ దక్కాయి. ఇప్పటివరకు తెలుగు సినిమాలకు చెందిన ఏ పాటలు కూడా కేవలం మూడు వారాల వ్యవధిలో మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకోలేదు.
కానీ నాటు నాటు పాట మాత్రం మూడు వారాల్లోనే మిలియన్ లైక్స్ మార్క్ అందుకని సంచలన రికార్డు ని అందుకుంది. ఈ పాటలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ అద్భుతమైన మాస్ స్టెప్స్ వేయడంతో ఈ పాటకు ఈ రేంజ్ లో లైకులు వచ్చాయి. ఇక బిగ్ స్క్రీన్ పై ఈ పాటను చూడాలని మెగా, నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు గా,తారక్ కొమురం భీమ్ గా కనిపించనున్నారు. ఇక వీరి సరసన ఆలియాభట్ ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు...!!