తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్ కి ఆయా హీరోల యొక్క అభిమనులతో పాటు తెలుగు ఆడియన్స్ లో కూడా భారీ క్రేజ్ ఉంటుంది. ఆ విధంగా నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఎంతో అద్భుత విజయాలు సొంతం చేసుకుని వారి క్రేజీ కాంబినేషన్ పై అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచాయి. దానితో వారిద్దరూ లేటెస్ట్ గా వర్క్ చేసిన అఖండ పై అందరిలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడడం జరిగింది.

ఇక ఇటీవల ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా సూపర్ గా రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఫైనల్ గా నిన్న భారీ అంచనాలతో రిలీజ్ అయిన అఖండ మాత్రం అనుకున్న స్థాయిలో టాక్ సంపాదించలేకపోయింది. సినిమాలో భారీ మాస్, యాక్షన్ సన్నివేశాలు, విపరీతంగా రక్తపాతం ఉన్నాయని, ముఖ్యంగా ఫ్యామిలీస్ ఈ సినిమా చూడడం కష్టం అని పలువురు ప్రేక్షకుల అభిప్రాయం. అయితే సినిమాలో హీరో బాలయ్య తాను పోషించిన రెండు పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి యాక్ట్ చేసారని, అలానే సాంగ్స్ కూడా బాగున్నాయని, అయితే థమన్ బీజీఎమ్ సెకండ్ హాఫ్ లో ఒకింత శృతిమించిందనే వారు కూడా లేకపోలేదు.

మరీ ముఖ్యంగా దర్శకుడు బోయపాటి సినిమాకి కీలకమైన స్టోరీ పై దృష్టిపెట్టలేదని, కథనం కూడా ఆకట్టుకునేలా లేకపోగా సినిమా సెకండ్ హాఫ్ చాలా వరకు సాగతీతగా ఉందని కూడా అంటున్నారు. ముచ్చటగా మూడోసారి బాలయ్య, బోయపాటి కాంబో లో రానున్న ఈ అఖండ పై తామందరం పెట్టుకున్న నమ్మకాలూ వొమ్మయ్యాయని, బోయపాటి మూవీ ఇలా తీస్తారని అసలు ఊహించలేదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా మొత్తంగా అఖండ కి భారీ ప్లస్ పాయింట్ గా నిలిచిన బాలయ్య మాత్రమే రాబోయే రోజుల్లో ఈ మూవీ ని ముందుకు నడిపించాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: