దీప్తి సున‌య‌న..ఈ అమ్మడు కి హీరోయిన్స్ కి మించిన ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మల లిస్ట్ లో దీప్తీ మొదటి స్దానంలో ఉంటుంది. తన అందం తో యాక్టింగ్ తో.. వీడియో లో చేసి యూట్యూబ్ లో పెట్టి కుర్రకారుల మతిపోగొడుతుంది. ఇక ఈ అమ్మడు కొ-యూట్యూబర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ తో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీళ్లు డ్యాన్స్ వీడియోస్ నెట్టింట ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి.

పలు కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్ ద్వారా పేరు సంపాదించుకున్న వీళ్లిద్దరు ఎప్పటి నుండో లవ్ చేసుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీళ్లు బిహేవ్ చేసే పద్ధతి కూడా అలాగే ఉండడం.. పబ్లిక్ గానే ఐ లవ్ యూ అని చెప్పుకుని హగ్ లు చేసుకోవడంతో .. వీళ్ల లవ్ స్ట్రాంగ్ అని డిసైడ్ అయిపోయారు అభిమానులు. ప్రస్తుతం షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు. తనదైన స్టైల్లో ఆట ఆడుతూ..టాప్ 5 కంటెస్టెంట లిస్ట్ లో ఉండటానికి ట్రై చేస్తున్నారు. ఇక షణ్ముఖ్ ని గెలిపించండి అంటూ దీప్తి కూడా బయట నుండి సపోర్ట్ చేస్తూ వస్తుంది.


ఇక తాజాగా దీప్తీ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. వరుణ్‌ అనే కంటెస్టెంట్‌కి దీప్తి సపోర్ట్ చేస్తూ..ఓట్లు వేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది. ఇంతకి  ఈ వరుణ్ ఎవరు అనుకుంటున్నారా..బిగ్ బాస్ 5 లోని కంటెస్టెంటే. యస్..తమిళంలో  ప్రసారమౌతున్న బిగ్‌బాస్‌ సీజన్‌-5 లో అతడు ఒక హౌస్ మేట్. అతడికి ఓట్లు వేయాలంటూ దీప్తీ సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్లను కోరింది. అంతేకాదు తాను వేసిన ఓట్స్‌ తాలుక  స్క్రీన్‌షాట్స్‌ని సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ అమ్మడు  షేర్‌చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: