నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై సుమారు 70 కోట్ల భారీ బడ్జెట్తో మిరియాల రవీందర్రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. బాలయ్యకి జోడిగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా.. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలో కనిపించారు. దాదాపు చాలా కాలం తర్వాత బాలకృష్ణ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను ఈ సారి మాత్రం వమ్ముచేయకుండా భారీ విజయాన్ని అందుకున్నాడు బాలయ్య.

 ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా. లెజెండ్ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో అంతకుమించిన రెస్పాన్స్ ఇప్పుడు అఖండ సినిమాకి వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా మాస్ ప్రేక్షకుల తో పాటు నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా కలెక్షన్స్ లో కూడా ఈ సినిమా సునామీ సృష్టిస్తోంది. బాలయ్య కెరీర్లోనే భారీ వసూళ్లను అందుకున్న సినిమాగా ఆఖండ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల వసూళ్లు రాబట్టింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమా థియేటర్ దగ్గర హౌస్ఫుల్ బోర్డ్ లు చూసి చిత్ర బృందంతో పాటు బాలయ్య కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఇక ఇప్పుడు తాజాగా బాలయ్య కు సంబంధించిన ఓ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఇక ఈ వీడియో అఖండ సినిమా షూటింగ్ సమయంలోదని తెలుస్తోంది. అఖండ షూటింగ్ సమయంలో ఓ చిన్నారి తో కలిసి ఆప్యాయంగా ఉన్న బాలయ్య వీడియో ఇప్పుడు నెట్టింట్లో లో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో బాలయ్య మునుపెన్నడూ లేని విధంగా ఆ చిన్నారిపై ప్రేమ, ఆప్యాయతలు చూపిస్తున్నాడు. అందుకే ఈ వీడియో ఇప్పుడు నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఫలితంగా సోషల్ మీడియా అంతట బాలయ్య క్యూట్ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: