సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సమావేశమైన సినీ ప్రముఖులు. ఈ సందర్భంగా వారు  కరోణ థర్డ్ వేవ్ వస్తున్న తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, అలాగే సినీ ఇండస్ట్రీలో తీసుకోవాల్సిన ముందు నిర్ణయాలపై ఎస్ ఎస్ రాజమౌళి, దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులతో మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమారంగ సమస్యలు, టిక్కెట్ ధరల పెంపు, కరోనా మూడో దశ నేపథ్యంలో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం, షూటింగులు వంటి అంశాలపై తలసానితో చర్చిస్తున్న సినీ ప్రముఖులు. రెండేళ్ల నుంచి కరోనా వల్ల సినీ పరిశ్రమ ఇబ్బందిగా మారింది అన్నారు.
ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో కొత్త రకం వైరస్ వస్తోందని, దాన్ని ఎదుర్కోవాలంటే అప్రమత్తంగా ఉండాలని దర్శక నిర్మాతలతో పిలిచి మాట్లాడానని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గతంలో పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించామని, ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడండని తెలియజేశారు.

 
ఏ వైరస్ వచ్చిన ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజలకు, సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండంగా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ  సినిమా చూస్తే థియేటర్లలోనే చూడండని, వ్యాక్సిన్ రెండు డోసులు దాదాపు పూర్తయ్యాయని సినీ పరిశ్రమ చాలా సున్నితమైనదని , కొన్ని వేల కుటుంబాలు ఆధారపడ్డాయని అన్నారు. సినిమా టికెట్ల ధరల విషయం పెండింగ్ లో ఉందని హైకోర్టులో సినిమా టికెట్ల ధరల అంశానికి త్వరలోనే పుల్ స్టాప్ పెడతాని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీలో వేల మంది ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్నారని, ఇప్పటికే కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ లలో చాలామంది రోడ్డున పడ్డారని, ప్రస్తుతం థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో  తెలంగాణ వ్యాప్తంగా టీకాలు వేశామని, ప్రతి ఒక్కరు ధైర్యంగా ఎదుర్కోవాలని సినీ ఇండస్ట్రీకి ఎల్లవేళలా ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: