అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి ముచ్చటగా, మూడో సినిమాగా అఖండ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య బాబు మురళీ కృష్ణ, అఖండ రెండు పాత్రలో నటించి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందారు. అంతేకాదు.. కూడా తనదైన మార్క్ తో సినిమాని తెరకెక్కించి నందమూరి అభిమనులకి బిగ్ ట్రీట్ ఇచ్చారు అనడంలో ఎలాంటి సందేహం లేదు..
ఇక ఇదిఇదిలావుండగా ఈ సినిమాలో నటి నవీనారెడ్డి కీ రోల్ ప్లే చేసింది. ఆమె తెరపై కనిపించింది కొద్దిసేపే అయిన ప్రేక్షకులకి రిజిస్టర్ అయ్యే పాత్రలో కనిపించరు. అయితే ఇది ఆమెకి మొదటి సినిమా కాదు. ఎఫ్2 సినిమాలో ఓ చిన్న రోల్ నటించింది. కాగా.. ఆ సినిమానే ఆమెకి మొదటిచిత్రం. ఈ సినిమా తరువాత వెంకీమామ, భీష్మ,అద్భుతం, హిట్ మొదలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక దేవయాని,అర్ధశతాబ్దపు సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆమె నటించిన సినిమాలు నటిగా ఐడెంటిటీని ఇవ్వలేకపోకపోయినప్పటికీ అఖండలో చేసిన రోల్ ఆమెకి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. అయితే నవీనా వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె పక్కా హైదరాబాదుకి చెందిన అమ్మాయి. అతనికి ఓ చెల్లెలు కూడా ఉంది. ఆమె మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమాని.. చిరంజీవికి కరోనా సోకినప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు కూడా నిర్వహించింది.