ముద్దు గుమ్మ సమంత, నాగ చైతన్య హీరో గా గౌతం మీనన్ దర్శకత్వం లో తెరకెక్కిన  ఏం మాయ చేశావే సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా సమంత అంద చందాలకు, నటన కు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటం తో ఈ ముద్దు గుమ్మకు తెలుగు నాట క్రేజీ సినిమా అవకాశాలు కూడా దక్కాయి. అందులో భాగంగా టాలీవుడ్ టాప్ హీరో ల సరసన నటించిన ఈ ముద్దు గుమ్మ అతి తక్కువ కాలం లోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, సమంత కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్, హిందీ భాష ల్లో కూడా నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించింది. ప్రస్తుతం కూడా సమంత బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లను ఓకే చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి,  ఇప్పటికే సమంత బాలీవుడ్ లో ది ఫ్యామిలీ మాన్ సీజన్ టు వెబ్ సిరీస్ తో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.

అలాగే తెలుగులో కూడా శాకుంతలం సినిమాలో సమంత హీరోయిన్ గా సమంత నటిస్తోంది, ఇలా సినిమా లతో, వెబ్ సిరీస్ ల తో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. సినిమా లతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా లో సమయాన్ని కేటాయించి అభిమాను లతో టచ్ లో ఉండే ఈ ముద్దు గుమ్మ ఇంస్టాగ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది, ఇలా సమంత సోషల్ మీడియా లో తన సత్తా చాటుతోంది. దీని తో సమంత ఫాలోయింగ్ సోషల్ మీడియా లో ఏ మేరకు ఉందో అనేది స్పష్టం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: