రామ్ చరణ్ భార్య గా.. ఉపాసన ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె తరుచు ఎప్పుడూ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఆమెకు ప్రకృతి అన్న, వాటిలో ఉండే జీవరాసులు అన్న చాలా ఇష్టమట. అంతేకాకుండా ఏవైనా పక్షులకు జంతువులకు సంబంధించి కొన్ని ఆయుర్వేద చిట్కాలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఉపాసన నెటిజన్ల ప్రశంసలందుకుంటోంది వాటి గురించి చూద్దాం.


ఉపాసన తనకు సంబంధించి ఏవైనా విషయాలను ఎక్కువగా మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడదు.. కేవలం సోషల్ మీడియాలో  మాత్రమే పంచుకుంటూ ఉంటుంది. అయితే తనకు సంబంధించి నెగిటివ్ కామెంట్లు పైన కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రముఖ ఛానల్ కు కొన్ని సమాధానాలు తెలియజేసింది. ఆ విషయాలు కూడా బాగా వైరల్ గా మారాయి. అందులో ముఖ్యంగా పిల్లలు విషయంపై అది మా వ్యక్తిగత విషయమని ఘాటుగా సమాధానం తెలియజేసింది.

ఇక అంతే కాకుండా ట్రాన్స్ జెండర్ తో ఉన్న స్నేహ బంధాన్ని కూడా పూర్తిగా వివరించింది. ఇక అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది ఇప్పుడు. ఇక ఉపాసన వారి యొక్క జీవిత విషయాలను కూడా చాలా గొప్పగా తెలియజేసింది. ఇక ఉపాసన సోదరి అనుష్ పాల పెళ్లి వేడుకల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి.

తాజాగా కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ట్రాన్స్ జెండర్ తో కలిసిన ఒక ఫోటోని షేర్ చేసి వారి గురించి కొన్ని ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా తన సోదరి వివాహానికి వారిని ఆహ్వానించి నట్లు గా కనిపిస్తోంది. తెలుసుకున్న మెగా అభిమానులు ఉపాసన మంచితనం గురించి మాట్లాడుకుంటున్నారు. సామాన్య ప్రజలు మాత్రం ట్రాన్స్ జెండర్ ను అదోలా చూస్తారని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: