తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరైన హీరోలలో శ్రీకాంత్ ఒక్కరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించడమే కాకుండా పలువురు స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షుకుల నుండి మంచి ఆదరణ పొందారు. శ్రీకాంత్ ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాలో ఏకంగా విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

శ్రీకాంత్ సిండస్ట్రీకి వచ్చిన మొదట్లో నెగిటివ్ పాత్రలలో నటించారు. ఆ తరువాత ఆయన హీరోగా మారారు. శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను చెప్పారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఒక విషయంలో తన తండ్రితో గొడవపడి ఏకంగా చెరువులో దూకుతానని బెదిరించారనని చెప్పుకొచ్చారు. అయితే శ్రీకాంత్ ఏదో ఒక విషయంలో తప్పు చేయడంతో తన తండ్రి బాగా వార్నింగ్ ఇచ్చి ఇంటికి రమ్మని అన్నారంట అందుకే అలా చేశానని అన్నారు.
 
అయితే చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీకాంత్ హీరోయిన్ ఊహను ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి అందరికి తెల్సిందే. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు. ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందD సినిమాల ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కాగా.. శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీలో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఊహ పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరమై ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉంది. శ్రీకాంత్ సినిమాలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీకాంత్ లాగే అతని కొడుకు కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: