తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఒక్కరు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చిన్నవయసులోనే ఎన్నో అద్భుతమైన సినిమాలకు మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నారు. ఆయన మ్యూజిక్‌తో ప్రేక్షకులను అలరిస్తూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నాడు.

అయితే దేవి శ్రీ ప్రసాద్ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు ఇంకా బ్రహ్మచారిగానే మిగిలున్నారు. ఇక అప్పట్లో దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అంతేకాదు.. అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ హీరోయిన్ ఛార్మికి మధ్య ఏదో ప్రేమ యానం నడిచిందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అంతేకాక..  వీరి గురించి గతంలో ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే.

కాగా.. కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి మధ్య దూరం బాగా పెరిగిపోయిన సంగతి తెల్సిందే. ఇక చార్మి దేవికి దూరం అయిన తర్వాత దేవి శ్రీ ప్రసాద్ పూర్తిగా తన దృష్టిని సినిమాలపై పెట్టి ఎంతో బిజీగా మారిపోయాడు. దేవి శ్రీ ప్రసాద్‌ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటూ ఎంతో మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇక ఇది ఇలా ఉండగా తాజాగా దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది.

ఈ నేపథ్యంలోనే దేవిశ్రీప్రసాద్ ఒక తమిళ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ తరుణంలోనే దేవిశ్రీప్రసాద్ ఆ హీరోయిన్‌తో లవ్ ఎఫైర్ కొనసాగించడం వల్ల త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. ఇక ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందనే విషయంపై వారిద్దరూ నోరు విప్పితేగాని నిజం తెలీదు.

మరింత సమాచారం తెలుసుకోండి: