సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది సంగీత దర్శకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రం తమ టాలెంటు తో ఎంతో కాలం సినిమా ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లుగా కొనసాగుతూ ఉంటారు. అలా తెలుగు ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వారిలో తమన్ ఒకరు.  తమన్ ప్రస్తుతం తెరకెక్కుతున్న ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఈ మధ్య విడుదలైన అఖండ సినిమాకు తమన్ ఇచ్చిన సంగీతానికి మరియు ముఖ్యం గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయే రేంజ్ లో ఇచ్చినందుకు బాలకృష్ణ అభిమానుల నుండి తమన్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదిరిపోయే రేంజ్ లో అఖండ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అంటూ తమన్ ను బాలకృష్ణ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

అలాగే తమన్ పై సోషల్ మీడియా లో కాస్త ట్రోలింగ్ జరిగినప్పటికీ, అదే రేంజ్ లో అభిమానులు కూడా తమన్ ను పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు. దానికి ప్రధాన కారణం తమన్ ఎప్పటికప్పుడు తన మ్యూజిక్ తో ప్రేక్షకులను అలరించడమే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సంగీత దర్శకులలో ఒకరు గా కొనసాగుతున్న తమన్ ఒక్కో సినిమాకు 2:30 నుండి మూడున్నర కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాక పోతే మ్యూజిక్ డైరెక్టర్‌ కు వచ్చే రెమ్యున రేషన్‌ లో వారు సౌండ్ ఇంజనీర్ లకు, మ్యూజిక్ ప్లేయర్స్‌కు, మిక్స్ ఇంజనీర్ లకు కూడా తమ వాటా నుండే ఇవ్వవలసి ఉంటుంది. ఇలా ఇవన్నీ కలుపు కొని తమన్ రెమ్యునరేషన్ ఈ రేంజ్ లో ఉంటుంది అని ఒక రూమర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: