తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో సినిమాలు పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎలాంటి ప్రేక్షకులు అయిన పొలిటికల్ చిత్రాలను చూడటానికి ఇష్టపడరు. కానీ కొన్ని సినిమాలను ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించి వాటిని పొలిటికల్ థ్రిల్లర్ గా డిజైన్ చేయగా వాటిని అందరూ అభిమానించేలా చేశారు. అలా తెలుగు సినిమా ప్రేక్షకులు ఎక్కువ భాగం ఓ పొలిటికల్ సినిమా ను లైక్ చేశారు. అదే లీడర్ చిత్రం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన చాలా రోజులు ప్రేక్షకులను ఎంతగానో అలరించే మంచి సినిమాగా నిలిచింది.

ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల తొలిసారిగా ఓ సీరియస్ సినిమా ను ఎంచుకున్నాడు. అలాంటి ప్రయత్నం ఆయన చేయడం పట్ల ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇకపోతే పొలిటికల్ సినిమాలను పెద్ద హీరోలు మాత్రమే ఎక్కువగా చేస్తారు. అలాంటిది ఒక కొత్త హీరోని పెట్టి ఇంత పెద్ద సినిమాను తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. అలా శేఖర్ కమ్ముల హిట్ కొట్టి  అందరి దర్శకుల కెల్లా తాను డిఫరెంట్ అని నిరూపించు కున్నాడు. ఈ సినిమా లో హీరో గా చేసిన రానా దగ్గుబాటి ఆ తర్వాత ఎన్నో సినిమా లు చేసి ఎంతటి ప్రభంజనం సృష్టించాడో అందరికీ తెలిసిందే.

ఏదేమైనా శేఖర్ కమ్ముల రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ పొలిటికల్ నేపథ్యంలోనే సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. రెగ్యులర్ పొలిటికల్ సినిమా కంటే విభిన్నంగా సరికొత్తగా కథనాలతో ఈ చిత్రం తెరకెక్కింది. తండ్రి చనిపోయిన హీరో ముఖ్యమంత్రి పదవి లోకి వచ్చి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎలా సంహరించాడు. అవినీతి ని సపోర్ట్ చేయకుండా ఏ విధంగా ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. కొన్ని కొన్ని సెంటిమెంట్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: