హీరో శ్రీకాంత్ కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశాడు. లవర్ బాయ్ గా యాక్షన్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకుల వద్ద భారీ అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఆయన కెరీర్ లో చేసిన ఒక సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఆ చిత్రంతో ఒక్కసారిగా శ్రీకాంత్ తన రేంజ్ ను పెంచుకున్నాడు. సినిమాను తెరకెక్కించే విధానాన్ని మార్చుకున్నాడు. ఈపాటికే మనం ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. రాజకీయ నేపథ్యంలో పోసాని కృష్ణ మురళి దర్శకత్వంలో ఆపరేషన్ దుర్యోధన సినిమా ఏ రేంజిలో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

అప్పటి వరకు శ్రీకాంత్ అంటే ఫ్యామిలీ చిత్రాల హీరో హోమ్లీ మ్యాన్ అంటూ ప్రేక్షకుల్లో ఒక ముద్ర ఉండేది. కానీ ఈ సినిమాలో ఆయన నటించిన తీరు చూసిన తర్వాత ఆయన లోని సరికొత్త కోణంలో చూపించిన సినిమా ఇది అని అందరిని మంత్రముగ్దుల్ని చేశాడని అప్పట్లో ప్రతి ఒక్కరు చెప్పారు. ముఖ్యంగా ఫ్యామిలీని కోల్పోయిన హీరో ఏ విధంగా పొలిటికల్ గా ఎదిగి తన పగ తీర్చుకున్నాడు అనే సినిమా కథతో krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి తనదైన సంభాషణలు జోడించి ఈ చిత్రాన్ని చేయగా శ్రీకాంత్ ను హీరోగా ఎంచుకోవడంలోనే ఈ సినిమా సగం సక్సెస్ అయ్యింది.

సినిమా ఎంతటి సంచలనం అయిందో అంతే సంచలనం వసూళ్లను కూడా సాధించుకుంది.  రచయితగా దర్శకుడిగా మంచి పేరు పోసాని కృష్ణ మురళి కి వచ్చి ఈ చిత్రం భారీ  పేరు సంపాదించి పెట్టిందని చెప్పవచ్చు. ఆపరేషన్ దుర్యోధన అనే టైటిల్, శ్రీకాంత్ నటన మరి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ చిత్ర విజయానికి ఎంతో దోహదపడ్డాయి. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ఈ చిత్రానికి కొనసాగింపుగా మరొక సినిమా వచ్చింది కానీ ఆ సినిమా దీని రేంజ్ లో హిట్ అవలేదనే చెప్పాలి. మరి భవిష్యత్తులో శ్రీకాంత్ మరియు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి కలిసి ఇలాంటి పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలోని సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తారా చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: