ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమం బుల్లితెరపై బిగ్గెస్ట్ సినీ రియాలిటీ షో గా కొనసాగుతోంది. ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షిస్తు టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. కేవలం ఒక్క భాషలో మాత్రమే కాదు అన్ని భాషల్లో కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కన్నడ బుల్లితెరపై కూడా బిగ్బాస్ కార్యక్రమం ఎంతగానో అల్లరిస్తూ ఉంటుంది. అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో కి ఒక్కసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక సినీ ప్రేక్షకులందరికీ దగ్గర అవుతూ ఉంటారు.



 ఎలాంటి క్రేజ్ లేని వాళ్ళు సైతం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీ హోదాను సంపాదిస్తూ ఉంటారు. అంతేకాదు తమదైన ఆటతో ప్రేక్షకులందరినీ ఆకర్షించి ఇక ఎన్నో రోజుల పాటు బిగ్బాస్ హౌస్ లో కొనసాగుతూ ఉంటారు. ఇలా కన్నడ బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో మొదటినుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగి చివరికి రన్నరప్ గా నిలిచాడు కిరిక్ కీర్తి. ఇక తనదైన ఆటతో ఎంతోమంది బిగ్బాస్ ప్రేక్షకులను ఆకర్షించాడు. బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్ళిన తర్వాత ఎంతగానో క్రేజ్ సంపాదించాడు అని చెప్పాలి. ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న కీరిక్ కీర్తి పై ఇటీవలే దాడి జరగడం సంచలనంగా మారింది.



 ఏకంగా కిరిక్ కీర్తి పై బీర్ బాటిల్ తో దాడి జరిగింది. అతని స్నేహితులతో కలిసి సదాశివ నగర్ లో ఉన్న పబ్ కి వెళ్ళాడు కిరిక్ కీర్తి.. ఆ సమయంలో ఒక వ్యక్తి ఫోటో తీశాడు. దీంతో ఎందుకు ఫోటో తీసావు అంటూ అతన్ని ప్రశ్నించాడు  కీర్తి.  ఇదే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అవతల వ్యక్తి ఆవేశంలో ఏకంగా బీర్ బాటిల్ తో కిరిక్ కీర్తి పై దాడి చేశాడు. ఈ ఘటనలో కీర్తి తలకు బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: